ప్రజాశక్తి-ఉక్కునగరం : ఈ నెల 20వ తేదీన జరుగనునున్న స్టీల్‌ప్లాంట్ ఎస్సీ, ఎస్టీ అసోసియేషన్ గుర్తింపు ఎన్నికలలో యునైటెడ్ ప్యానెల్-2ను గెలిపించాలని ఆ ప్యానెల్ సభ్యులు కోరారు. గురువారం స్టీల్క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు బొండా తౌడన్న, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్. సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి బయ్యే మల్లయ్య మాట్లాడుతూ మొబైల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తిచేశారు. కార్మిక హక్కుల పరిరక్షణ, రిజర్వేషన్ల అమలుతో పాటు స్టీల్‌ప్లాంట్ ప్రయివేటీకరణ ఉద్యమంలో క్రియాశీలంగా వ్యవహరిస్తామన్నారు. ప్రమోషన్లలో జరుగుతున్న వివక్షను రూపుమాపుతామని, జూనియర్ ఆఫీసర్స్ టెస్ట్ నిర్వహణకు ప్రయత్నిస్తామని, విద్యార్థుల పోటీ పరీక్షలకు శిక్షణా తరగతులోపాటు మనో వికాసానికి సాంస్కృతిక కార్యక్రమాలు చేపడతామని,నోషనల్ సీనియారిటీ బెనిఫిట్‌ను అర్హులందరికీ అందించడానికి కృషి చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎం.గణేశ్, జి.వేణుగోపాలరావు, డి.పుల్లారావు, ఎల్వి. రమణారావు, ఎస్.మోహన్‌బాబు, లక్ష్మణమూర్తి, డి.అప్పారావు, ఎం.పైడికొండలరావు, జి.ఫణీంద్రబాబు, బి.కిశోర్‌సింగ్, కెవి.రత్నం, బిడి.నాయక్, వైటి.దాస్, ఆ.చిరంజీవి, బి.లాల్, బూలా జగ్జీవన్‌రామ్, కె.చిన్నంనాయుడు పాల్గొన్నారు.










