పరీక్షలు నిర్వహిస్తున్న వైద్యులు
ప్రజాశక్తి - ఎమ్మిగనూరు
పట్టణంలో సలాఫీ బైతుల్ మాల్ వెల్ఫేర్ సొసైటీ వారి ఆధ్వర్యంలో 8వ యునాని వైద్య శిబిరం విజయవంతమైంది. శనివారం 'మదరసా ఏ దారు సలాం'లో ముఖమీ జమాతే అహలేహాదీస్ తరఫున సలాఫీ బైతుల్ మాల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి అనూహ్య స్పందన లభించినట్లు నిర్వాహకులు మౌలానా ఉమర్ ఉమ్రి, మౌలానా మూస జమ్మియా, మానియర్ అమానుల్లా తెలిపారు. దాదాపు 150 మంది పేదలు దీర్ఘకాల వ్యాధులకు చికిత్స చేయించుకున్నారు. పేదలకు ఉచితంగా మందులను పంపిణీ చేశారు. రాబోయే రోజుల్లోనూ తమ సంస్థ తరఫున సేవలు నిర్వాహకులు తెలిపారు. కొండపురి అబ్దుల్ ఖదీర్, సిఎండి.ముజీబ్, శాలిమార్ నజీర్, ఆతిక్ అబ్దుల్, వహబ్, మౌలానా, సిబగతుల్లా పాల్గొన్నారు.










