Oct 21,2023 00:18

గుంటూరు: తెలుగు సాహిత్యానికి విమర్శకుడిగా గుంటూరు శేషేంద్రశర్మ పరిచిన దారి విశ్వజనీనమైందని, తెలుగు భాషా సాహిత్య వనంలో ఆరు దశాబ్దాలపాటు సాహితీ సేవ చేసిన యుగకవి ఆయన అని సాహితీవేత్తలు, కవులు, కళాకారులు కొని యాడారు. గుంటూరు లోని అవగాహన ఆధ్వ ర్యంలో శుక్రవారం జరి గిన జయంతి కార్య క్రమంలో శేషేంద్రశర్మకు పలువురు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రచ యిత్రి, జర్నలిస్టు పింగళి భాగ్యలక్ష్మి మాట్లా డుతూ శేషేంద్ర శర్మ కవిగా, విమర్శకుడిగా, బహుభాషా కోవిదుడుగా, గొప్ప కవితా వారసత్వానికి గట్టి పునాదులు వేశారని అన్నారు. ఆధునిక సంప్రదాయంరీతుల్లో సరి సమానంగా అనేకమైన మధురమైన కవితలు అల్లారని ప్రశంసించారు. ఆయన రచనల్లో ప్రధానాంశంగా ప్రకృతి, సామాన్య ప్రజల స్థితి గతులను కళ్లకు గట్టినట్టుగా కన్పించేవని అన్నారు. 'ప్రకృతి అందాలు నా కవితలకు స్ఫూర్తి, ప్రజల కష్టాలు, నా కవితలకు స్ఫూర్తి' అని శేషేంద్రశర్మ పలు సందర్భాల్లో చెప్పేవారని గుర్తుచేశారు. సాహితీరంగ విశ్లేషకులు మాట్లాడుతూ శేషేంద్ర శర్మ రచనల్లో నా దేశం- నా ప్రజలు, మండే సూర్యుడు, గొరిల్లా, ఆధునిక భారతం, కవిసేన మేనిఫెస్టో వంటివి అత్యంత ప్రధానమైనవని అన్నారు. 1994లో రాసిన 'కాలరేఖ'కు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించిందని, 2004లో నా దేశం- నా ప్రజలు రచన నోబుల్‌ సాహిత్య పుర స్కారానికి నామినేట్‌ అయిందని గుర్తుచేశారు. గాయ కులు ఎం.ఘనశ్యామాచార్యులు మాట్లా డుతూ శేషేంద్రశర్మ గొప్ప ఆధునిక భావాలు పుణికిపుచ్చుకున్న భావకవి అని కొనియాడారు.