Jun 07,2021 09:32

(మళ్లీ జైలుకు వెళ్లిన నతాషా నర్వాల్‌ కోసం)
ఆధిపత్య రాజ్యంతోనో
పితృస్వామ్య రాజ్యంతోనో
యుద్ధం చేస్తున్న యువతులు
అపార సౌందర్యరాశులు
భయరహితమైన వారి ముఖాలు
అగ్ని వెదజల్లే కళ్లు
ముడిబడిన కనుబొమలు
ఆకసంలోకి ఎగుస్తున్న పిడికిలి
జైలు కటకటాల భయం నుంచి
విడుదలైన చిరునవ్వు ముఖం
ఒక కొత్త లోకానికి ఆహ్వానం
పలుకుతున్న దేహభాష
హిందీ కవుల సౌందర్య భావనను
మట్టిలో కలుపుతున్నాయి
నతాషా నర్వాల్‌
కేవలం ఒక అమ్మాయి పేరు కాదు
అది మన కాలపు ప్రతిఘటనకు
మూర్తీభవ రూపపు పేరు
అది మనలో విప్లవాగ్నిని నింపుతుంది
లోలోపలి పిరికితనాన్ని బద్దలు కొడుతుంది
ఏదో ఒక కార్యాచరణకు పురికొల్పుతుంది
అన్యాయాన్ని ప్రతిఘటించడానికి
లేచి నిలబడమని మేల్కొలుపుతుంది
నతాషా నీకు వందనం
 

హిందీ: సిద్ధార్థ్‌ రాము
(తెలుగు అనువాదం : ఎన్‌ వేణుగోపాల్‌)