Sep 02,2023 23:34

- ప్రశాంతతకు భంగం కలిగిస్తే సంహించను 
- దైర్యం ఉంటే ముందుకొచ్చి మాట్లాడాలి 
- మీడియాతో కరణం వెంకటేష్‌
ప్రజాశక్తి - చీరాల
ప్రజల ప్రశాంతతకు భంగం కలిగిస్తే చూస్తూ ఊరుకోమని వైసిపి ఇంచార్జి కరణం వెంకటేష్ అన్నారు. డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ వర్దంతి సందర్భంగా స్థానిక గడియార స్తంభం సెంటర్లోని వైఎస్‌ఆర్‌ విగ్రహానికి పాలాభిషేకం చేసినివాళి అర్పించారు. ఈ సందర్భంగా కరణం మాట్లాడుతూ సిఎం వైఎస్‌ జగన్‌ తండ్రి బాటలో సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా భావించి పరిపాలన సాగిస్తున్నారని అన్నారు. సిఎం జగన్‌ బాటలో చీరాలను ప్రశాంతంగా ఉంచుతూ అభివృద్ధి పథంలో నడిపిస్తున్నామని అన్నారు. ఎవరి పనివారు చేసుకుంటే మంచిదని అన్నారు. ప్రశాంతంగా ఉన్న చీరాలపై ఎక్కడో ఉండి నోరు జారడం సరికాదని అన్నారు. దమ్ముంటే ఎదురు పడాలని అన్నారు. గతంలో మాదిరి వైసీపీ నాయకులు, కార్యకర్తల జోలికి వస్తే తరిమికొడతామని అన్నారు. రౌడీ రాజ్యం చేయడానికి ఇప్పుడు కుదరదని అన్నారు. రాముడు లాంటి బలరామ కృష్ణమూర్తి ఉన్నారని అన్నారు. ప్రశాంతతకు భంగం కలిగిస్తే బిగించుకోడానికి పనికి రాకుండా నట్లు ఉడగొడతామని పరుషంగా మాట్లాడారు. గతంలోలాగ బెదిరింపు రాజకీయాలు సహించేది లేదన్నారు. ఇదే పార్టీలో ఉంటూ కుట్ర రాజకీయాలు చేస్తే ఎలా ఎదుర్కోవాలో చూపిస్తామన్నారు. కార్యక్రమంలో మునిసిపల్ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు, వైస్ చైర్మన్ బోనిగల జైసన్ బాబు పాల్గొన్నారు.