Oct 04,2022 22:49

సమీక్ష చేస్తున్న జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అప్పలస్వామి

ప్రజాశక్తి -భీమునిపట్నం : యుద్ధ ప్రాతిపదికన ఇకెవైసి నమోదు ప్రక్రియ పూర్తిచేయాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి కె.అప్పలస్వామి స్పష్టం చేశారు. స్థానిక వ్యవసాయ శాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ కార్యాలయంలో మంగళవారం ఆయన ఈ పంట, ఇకెవైసి నమోదు ప్రక్రియపై సమీక్ష జరిపారు. ఈ పంట నమోదులో భాగంగా డివిజన్‌ పరిధిలో మండలాల వారీగా ఇకెవైసి ఇప్పటి వరకూ ఏ మేరకు పూర్తయినదీ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ బొడ్డేపల్లి విజయప్రసాద్‌ ఆయనకు వివరించారు. భీమిలి మండలంలో 3,378 మంది రైతులు 3,820 ఎకరాల విస్తీర్ణంలో వేసిన వివిధ పంటలకు, ఆనందపురంలో 6,070 మంది రైతులు 7,150 ఎకరాల విస్తీర్ణంలో వేసిన వివిధ పంటలకు, పద్మనాభం మండలంలో 6,452 మంది రైతులు 11,487 ఎకరాల్లో వేసిన వివిధ పంటలకు ఈ పంట నమోదు చేసినట్లు వివరించారు. ఇకెవైసి నమోదు ప్రక్రియ ఈ నెల 10వ తేదీ లోగా పూర్తిచేయాలని ఆదేశించారు.