Nov 04,2022 23:45

అప్రోచ్‌ బ్రిడ్జి నిర్మాణ పనులను పరిశీలిస్తున్న ఎంపిపి కారం లక్ష్మి తదితరులు

ప్రజాశక్తి-విఆర్‌.పురం : మండలంలోని అన్నవరం వాగు వద్ద అప్రోచ్‌ బ్రిడ్జి నిర్మాణ పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని విఆర్‌ పురం ఎంపీపీ కారం లక్ష్మి ఆదేశించారు. శుక్రవారం సర్పంచ్‌ పూనెం సరోజిని, సిపిఎం నాయకులతో కలిసి పనుల పురోగతిని ఎంపిపి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీపీ కారం లక్ష్మి మాట్లాడుతూ అనేక తుపాన్లకు అన్నవరం బ్రిడ్జి కొట్టుకుపోయిందని, దీని నిర్మాణానికి వివిధ రూపాలలో అధికారులకు విన్నవించడం జరిగిందని తెలిపారు. ప్రస్తుతం అప్రోచ్‌ పనులు నిర్మిస్తేనే డ్రైవర్సన్‌ నిలబడుతుందన్నారు. వచ్చే వర్షాకాలం రాకముందే అన్నవరం వాగుపై వంతెన స్థానంలో ఐ లెవెల్‌ వంతెన నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు పూనెం సత్యనారాయణ, మండల కార్యదర్శి సోయం చినబాబు, నాయకులు పంకు సత్తిబాబు, కమ్మచిచ్చు సత్యనారాయణ, కారం సుందరయ్య, అజరత్‌, పాల్గొన్నారు.