సచివాలయం పక్కనే పదిరోజులుగా ఇదే పరిస్థితి
కనీసం కన్నెత్తి చూసి, పట్టించుకునే నాధుడే కరువు
ప్రజాశక్తి - అడ్డతీగల : మండల కేంద్రంలోని సచివాలయం-1కి కేవలం పది మీటర్ల దూరంలో ఉన్న పంచాయతీ వాటర్ ట్యాంకు మోటార్ నుంచి గడచిని పదిరోజులుగా తాగునీరు వృథాగా పోతున్నా పట్టించుకునే నాధులే కరువయ్యారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రతిరోజూ మండల స్థాయి అధికారులు, పంచాయతీ సిబ్బంది, అధికారులు అదే బోరు పక్క నుంచి వెళ్లివస్తుంటారు. కానీ ఏ ఒక్కరూ భారీస్థాయిలో వృథాగా పోతున్న తాగునీరుపై కనీనం పట్టించుకోకపోగా, తమకు పట్టనట్లు వ్యవహరించడం దారుణమని స్థానికులు ఆరోపిస్తున్నారు ఇప్పటికైనా సంబంధిత అధికారులు కళ్లు తెరిపి, తాము వెళ్లే మార్గంలో సచివాలయం వద్దే భారీగా వృథాగా పోతున్న తాగునీటి లీకేజీలను అరికట్టాలని కోరుతున్నారు.అంతేకాక పది రోజులుగా ఇదే పరిస్థితి కొనసాగుతున్నా, అటుగానే అందరూ వెళుతున్నా, దీనిపై స్పందించకపోవడం బాధ్యతారాహిత్యమేనని, దీనిపై ఉన్నతాధికారులు దృష్టి సారించి, పంచాయతీ, సచివాలయ సిబ్బందికి విధులు నిర్వహణ, బాధ్యతలపై తగు సూచనలు చేయాలని కోరుతున్నారు.










