Aug 29,2023 23:20

నిరసన తెలుపుతున్న టిడిపి నాయకులు

* మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ
* ఇసుక అక్రమ రవాణాపై నిరసన
ప్రజాశక్తి - కొత్తూరు : 
వైసిపి ప్రభుత్వంలో సహజ వనరుల దోపిడీ యథేచ్ఛగా సాగిపోతోందని మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ విమర్శించారు. మండలంలోని మాతల, నివగాం ఇసుక ర్యాంపుల వద్ద మంగళవారం నిరసన కార్యక్రమం చేపట్టేందుకు బయలుదేరిన ఆయన్ను పోలీసులు మంగళవారం గృహ నిర్బంధం చేశారు. పోలీసుల కళ్లుగప్పి వచ్చిన ఆయన కలమట పాలకొండ, హడ్డుబంగి రహదారిపై బైఠాయించారు. ఆయనతో పాటు ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్‌, పాలకొండ నియోజకవర్గ టిడిపి ఇన్‌ఛార్జి నిమ్మక జయకృష్ణ, టిడిపి రాష్ట్ర కార్యదర్శి కలమట సాగర్‌ ఆందోళనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలమట మాట్లాడుతూ ఇసుక అక్రమ తవ్వకాలపై అధికారులు ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. ఇసుక దోపిడీకి అడ్డుకట్ట వేయాలన్నారు. అనంతరం తహశీల్దార్‌ ఎం.చక్రవర్తి, సిఐ ఆర్‌.వేణుగోపాలరావుకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు మోహనరావు, ఎ.అరుణ్‌కుమార్‌, ఎల్‌.భగవాన్‌దాస్‌ నాయుడు తదితరులు పాల్గొన్నారు.