చోద్యం చూస్తున్న అధికారులు, నేతలు
తక్షణ చర్యలకు గిరిజన సంఘం డిమాండ్
ప్రజాశక్తి -అరకులోయ రూరల్ : మండలంలోని బొండం పంచాయతీ పరిధి కొలియగూడ, కొత్తవలస, కరకవలస, రేగ, గ్రామాలను అనుకుని ఉన్న గెడ్డల నుంచి కొన్నాళ్లుగా నిత్యం ఇసుక అక్రమ రవాణా జరుగుతున్నా స్థానిక అధికారులు పట్టించుకోకపోవడంతో దారుణమని గిరిజన సంఘం మండల నాయకులు జి బుజ్జి బాబు, కె బుజ్జి బాబు అప్పన్న విమర్శించారు. సర్పంచ్ అండదండల యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా సాగుతున్న అధికారులు పట్టించుకోవడం లేదని, దీంతో ఈ అక్రమాలకు అడ్డూఅదుపూ లేకుండా పోతోందన్నారు. ప్రయివేటు వ్యక్తులతో సర్పంచ్ చేతులు కలిపి ఇసుక అక్రమ రవాణా అప్పగించడం ఎంతవరకు సమంజసంమన్నారు. .పంచాయతీ, గ్రామసభ, పీసా కమిటీ సభ్యుల అనుమతుల్లేకుండా ఇసుక అక్రమ దందా సాగుతోందన్నారు..ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రభుత్వాదాయానికి గండిపడకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో గిరిజన సంఘం నాయకులు జోషి, బుజ్జి బాబు గ్రామస్థులు పాల్గొన్నారు










