Oct 05,2023 00:02

యథేచ్ఛగా చెట్లు నరికివేత స్పందించని అధికారులు


యథేచ్ఛగా చెట్లు నరికివేత
స్పందించని అధికారులు

ప్రజాశక్తి - కోట : వాతావరణం సమతుల్యత, పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా రాష్ట్రంలో విరివిగా మొక్కలు నాటే కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. జగనన్న పచ్చతోరణం వన మహోత్సవం పేరుతో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభిస్తే జాతీయ అటవీ విధానానికి అనుగుణంగా 33 శాతం పచ్చదనాన్ని పెంపొందిస్తూ ఆకు పచ్చని ఆంధ్రావని సాధనే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని పిలుపు నిచ్చారు. మొక్కలు నాటే కార్యక్రమం ఓ యజ్ఞంలా చేపట్టాలని కూడా తెలిపారు. ఇంతగా చెట్ల పరిరక్షణ కోసం ప్రభుత్వం ఆరాట పడుతుంటే కొందరు ఆ చెట్లను నరికివేసి సొమ్ము చేసు కుంటు న్నారు. కోట మండల పరిధిలో ఎక్కడపడితే అక్కడ ఎలాంటి అనుమతులు పొందకుండా నరికివేస్తూ అక్రమంగా అమ్మేస్తుండడంతో పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ మేరకు కోట మండలంలోని డాక్టర్‌ బీ ఆర్‌ అంబేద్కర్‌్‌ గురుకుల పాఠశాలకు వెళ్లే రోడ్డు పక్కన, కోట దళితవాడ లో ఓ వ్యాపారస్తుడు పలు చోట్ల చెట్లును నరికివేసి అక్కడ దాస్తున్నారు. మొత్తానికి అన్నీ రకాల చెట్లు నరికి వివిధమైన రకాలుగా వ్యాపారం కోసం వినియోగిం చుకుంటున్నారు. ఇప్పటికైనా సంబంధింత అధికారులు పర్యవేక్షణ చేసి అక్రమంగా చెట్లు నరికివేసి విక్రయాలను అడ్డుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.