Nov 13,2023 21:21

ఫొటో : మాట్లాడుతున్న మత్స్యకారులు

యథేచ్ఛగా అలవి వలలతో చేపల వేట
ప్రజాశక్తి-అనంతసాగరం : సోమశిల జలాశయంలో అధికారుల అండదండలతో నిషేధ అలవి వలలతో కొనసాగుతున్న మత్స్య వేటతో స్థానిక మత్స్యకారులు తమ జీవన ఉపాధి కోల్పోతున్నా మని వాపోయారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జలాశయంలో నిషేధ అలవి వలతో వేట నిషేధమైనప్పటికీ నిరంతరంగా అలివి వలల వేట నేటికీ కొనసాగుతోందన్నారు. అధికారులతో లోపాయకారి ఒప్పందాలతో యథేచ్ఛగా చేపల వేట కొనసాగుతుందనే దానికి నిదర్శనంగా ఇక్కడ స్థానిక మత్స్యకారుల ఆవేదనను అర్థం చేసుకోవచ్చన్నారు.
నిషేధ అలవి వలలతో వేట కొనసాగిస్తే భవిష్యత్తు తరాలకు మత్స్య సంపద పూర్తిగా అంతరించి పోతుందని, మత్స్యకారులు భవిష్యత్తులో చేపలవేట మానుకోవాల్సిన పరిస్థి తులు ఏర్పడుతాయని వాపోయారు. ఇకనైనా అధికారులు స్పందించి సోమ శిల జలాశయంలో కొనసాగుతున్న అలివివలలను నిషేధించాలని కోరారు.