అవార్డును అందుకుంటున్న గ్రేస్ ఫౌండేషన్ అధినేత జోత్స్న
ప్రజాశక్తి-భట్టిప్రోలు: మండలంలోని పల్లెకోన గ్రామానికి చెందిన గ్రేస్ ఫౌండేషన్ అధినేత కైతేపల్లి షాలేం రాజ్, జోత్స్నల కుమారుడు యశ్వంత్ రారు 2023-సూపర్ కిడ్ అవార్డును అందుకునట్లు ఫౌండేషన్ సభ్యులు యాన్నం సురేష్ తెలిపారు. లిటిల్ సామ్స్ అకాడమీ ఆఫ్ ఇండియా, లోటస్ కల్చరల్ ఆర్గనైజేషన్ హైదరాబాద్ వారు నిర్వహించిన ఈ కార్యక్రమంలో యశ్వంత్ రారుకి సేవా కార్యక్రమాలకు గాను అవార్డును అందించినట్లు పేర్కొన్నారు. చిన్నారులను ప్రోత్సహించేందుకు గాను సంస్థ 40 మందికి ఈ అవార్డులు అందించగా వీరిలో ఒకటి యశ్వంత్‌కు దక్కడం అభినందనీయమన్నారు. ఈ మేరకు పలువురు అభినందించారు.










