ప్రజాశక్తి-వేటపాలెం
సెయింట్ ఆన్స్ ఇంజినీరింగ్ కళాశాలకు నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎక్రిడిషన్ వారి గుర్తింపు మరో మూడు విద్యా సంవత్సరాలకు పొడిగించినట్లు కళాశాల సెక్రటరీ వనమా రామకష్ణారావు, కరస్పాండెంట్ శ్రీమంతుల లక్ష్మణరావు శనివారం ఓ సంయుక్త ప్రకటనలో తెలిపారు. సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజి 2001లో స్థాపించినట్లు పేర్కొన్నారు. న్యూఢిల్లీలోని ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ గుర్తింపు, కాకినాడ జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ శాశ్వత గుర్తింపు పొందిదన్నారు. నేషనల్ బోర్డ్ అఫ్ ఎక్రిడిటేషన్ వారిచే మూడు సార్లు గుర్తింపు, నాక్ వారిచే రెండు సార్లు ఏ గ్రేడ్ గుర్తింపు, యూనివర్సిటీ గ్రాంట్స్ కమీషన్ వారిచే 2 (యఫ్) 12(బి) ద్వారా గుర్తింపు, అటానమస్ కళాశాలగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా ఏ గ్రేడ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్ ద్వారా శాశ్వత గుర్తింపు, టైమ్స్ ఆఫ్ ఇండియా, సి.ఇ.జి.ఆర్ సంస్థల సర్వేద్వారా భారత దేశములోని ప్రముఖ ఇంజినీరింగ్ కళాశాలలో ఒకటిగా గుర్తింపు పొందినట్లు తెలిపారు. ఈ గుర్తింపు కళాశాలకు మరొ కలికితురాయి కానున్నదన్నారు ఈ సందర్భంగా కళాశాలలో శనివారం అభినందన సభ నిర్వహించారు. సభలో సిఎస్‌ఇ విభాగాధిపతు హరిణి, ఇసిఇ విభాగాధిపతి కె. జగదీష్ బాబు, వివిధ విభాగాధిపతులు అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు కళాశాల యాజమాన్యమునకు హర్షధ్వానాల మధ్య అభినందనలు తెలియజేశారు.










