Nov 02,2023 20:44

పార్వతీపురం : యర్రన్నాయుడుకు నివాళ్లు అర్పిస్తున్న టిడిపి నాయకులు

ప్రజాశక్తి -పార్వతీపురంరూరల్‌ :  శ్రీకాకుళం మాజీ పార్లమెంటు సభ్యులు, తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నాయకులు కీర్తిశేషులు కింజరాపు యర్రన్నాయుడు సేవలు మరువలేనివని టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్‌ అన్నారు గురువారం స్థానిక టిడిపి పార్టీ కార్యాలయంలో జరిగిన యర్రన్నాయుడు వర్ధంతి కార్యక్రమంలో టిడిపి నియోజకవర్గ ఇన్చార్జి బోనెల విజరు చంద్రతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన ఈ కార్యక్రమంలో సీనియర్‌ నాయకులు గొట్టాపు వెంకట నాయుడు, కొల్లి తిరుపతిరావు, పట్టణ పార్టీ అధ్యక్షులు జి.రవికుమార్‌, నాయకులు కోల బాబు, జాగాన రవికుమార్‌, అక్కేన శ్రీనివాసరావు, జి.రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు.
వీరఘట్టం : స్థానిక జామివారి కాంప్లెక్స్‌ ఆవరణలో గురువారం కీర్తిశేషులు మాజీ కేంద్ర మంత్రి కింజరాపు యర్రన్నాయుడు వర్ధంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మండల టిడిపి అధ్యక్షులు ఉదయాన ఉదయ భాస్కర్‌, ప్రధాన కార్యదర్శి చింత ఉమామహేశ్వరరావు, పట్టణ అధ్యక్షులు జామి లక్ష్మీనారాయణ, నియోజకవర్గ తెలుగుయువత అధ్యక్షులు పారిచర్ల వెంకటరమణ, మండల యువత అధ్యక్షులు మాచర్ల అనిల్‌, ఎఎంసి మాజీ చైర్మన్‌ పి.కృష్ణమూర్తి నాయుడు, బల్ల హరిబాబు, ఎ.కుమారస్వామి, బి.నీలకంఠంనాయుడు, కార్యకర్తలు, అభిమానులు, పాల్గొన్నారు.
సీతంపేట : యర్రన్నాయుడు వర్ధంతి పాలకొండ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్‌ఛార్జి నిమ్మక జయకృష్ణ ఆధ్వర్యాన మండలంలోని ధారపాడులో నిర్వహించారు. యర్రన్నాయుడు చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో రాష్ట్ర ఎస్టీ సెల్‌ కార్యదర్శి బిడ్డిక చంద్రరావు, మండల ప్రధాన కార్యదర్శి బిడ్డిక అప్పారావు, బిడ్డిక సుబ్బారావు, బిడ్డిక స్వామినాయుడు, మండంగి ప్రకాశం, ప్రచార కర్త తోయిక సంధ్య రాణి, మాజీ ఎంపిటిసి ఆరిక సువర్ణ, ఆరిక వరలక్ష్మి, సుందరరావు, ఆనందరావు, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.