Nov 17,2023 23:54

మంగళగిరి రూరల్‌: మంగళగిరి -తాడేపల్లి కార్పోరేషన్‌ పరిధి యర్రబాలెం లో అక్రమంగా తర లిస్తున్న రేషన్‌ బియ్యాన్ని మంగళ గిరి రూరల్‌ పోలీ సులు పట్టు కున్నారు. మంగళ గిరి రూరల్‌ ఎస్‌ఐ క్రాంతి కిరణ్‌ తెలిపిన వివరాల మేరకు తాడేపల్లి ఎన్టీఆర్‌ కరకట్ట కు చెందిన చిట్టి పోతుల జోజి బాబు కార్పొరేషన్‌ పరిధి యర్రబాలెం లో ఇంటింటా తిరిగి 35బస్తాల రేషన్‌ బియ్యాన్ని కొనుగోలు చేశాడు. అనంతరం ఆ బియ్యాన్ని ఆటోలో రేపల్లె కు తరలించేందుకు సిద్ధమయ్యాడు. పక్కా సమాచారం అందుకున్న మంగళగిరి రూరల్‌ పోలీసులు గురువారం రాత్రి మెరుపు దాడి నిర్వహించి రేషన్‌ బియ్యం తరలిస్తున్న జోజి బాబును అదుపులోకి తీసుకున్నారు. ఆటోను సీజ్‌ చేసి స్టేషన్‌ కు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.