Jun 09,2023 23:20

తాడేపల్లి: ఉండవల్లి సెంటర్‌ సచివాలయ పరిధిలోని 195 మందికి శుక్రవారం ఇళ్లపట్టాలు అందజేశారు. యర్ర బాలెం లేఅవుట్‌లో ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి చేతుల మీదుగా లబ్ధిదారులు పట్టాలు అందుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వచ్చే నెల 8 నుంచి సామూహిక శంకుస్థాపన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సంక్రాంతి నాటికి గృహ ప్రవేశాలు చేసేలా చర్యలు తీసుకుంటున్నా మన్నారు. ఈ కార్యక్రమంలో ఆప్కో చైర్మన్‌ గంజి చిరంజీవి, వైసిపి జిల్లా ప్రధాన కార్య దర్శి ఇ.డేవిడ్‌రాజు, పట్టణ అధ్యక్షులు బి.వేణుగోపాల సోమిరెడ్డి, సోషల్‌ మీడియా జిల్లా కన్వీనర్‌ ఎం.వెంకటరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.