Nov 05,2023 20:37

యోగాలో సాధించిన పతకాలతో విద్యార్థులు

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : రాష్ట్ర స్థాయి అండర్‌-19 స్కూల్‌ గేమ్స్‌ యోగా పోటీలలో నగరంలోని కంటోన్మెంట్‌ పాఠశాల విద్యార్థులు మెరిశారు. పశ్చిమగోదావరి జిల్లాలో జరిగిన పోటీల్లో విద్యార్థులు పాల్గొని రాణించారు. యోగాలో పి.చైతన్య , సయ్యద్‌ ఇమ్రాన్‌ ప్రతిభ కనబరిచి కాంస్యపతకాలు సాధించారు. వీరికి బుద్ధయోగ ఫౌండేషన్‌ ద్వారా యోగ టీచర్‌ ఆర్‌.జ్యోతి తర్ఫీదునిచ్చారు. వీరిని పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం. కాంచన , పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులు శేఖర్‌, పిఇటి ప్రమీల, ఉపాధ్యాయులు అభినందించారు.