
ప్రజాశక్తి - ఆగిరిపల్లి
సౌత్‌జోన్ యోగా ఛాంపియన్ షిప్ పోటీల్లో మండలంలోని తోటపల్లి హీల్ స్కూల్‌కు చెందిన విద్యార్థులు అండర్-14 విభాగంలో మొదటి స్థానం నిలిచి బంగారు పతకం సాధించారు. జాతీయస్థాయి యోగా పోటీలకు 19 మంది విద్యార్థులు ఎంపికైనట్లుగా హీల్ సిఇఒ కె.అజరు కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఎంపికైన విద్యార్థులను హీల్ వ్యవస్థాపక అధ్యక్షులు డా.కోనేరు సత్యప్రసాద్, సిఇఒ కూరపాటి అజరు కుమార్, ప్రిన్సిపల్ బి.సాయిబాబు, ఫిజికల్ డైరెక్టర్ సిహెచ్.ప్రభుదాసులు అభినందించారు.