ప్రజాశక్తి - మంత్రాలయం
యంత్ర సేవా పథకం రైతులకు వరంగా మారిందని వైసిపి నాయకులు వై.సీతారామిరెడ్డి తెలిపారు. మంత్రాలయంలోని మంచాల-2 ఆర్‌బికె కేంద్రంలోని శ్రీరాఘవేంద్ర స్వామి రైతు మిత్ర గ్రూపునకు వైఎస్‌ఆర్ యంత్ర సేవా పథకం కింద ట్రాక్టర్ మంజూరయింది. మంజూరైన ట్రాక్టర్‌ను రైతులు రాఘవేంద్ర, బసవరాజు రూ.7.89 లక్షలకు గాను రూ.3.08 లక్షలు సబ్సిడీ పోగా మిగతా నగదుకు 50 శాతం కెడిసిసి బ్యాంకు రుణం ద్వారా రైతు చెల్లించారు. మంజూరైన ట్రాక్టర్‌ను గురువారం మండలంలోని రాంపురం గ్రామంలో వైసిపి నాయకులు సీతారామిరెడ్డి చేతుల మీదుగా రైతులకు పంపిణీ చేశారు. అంతకు ముందు అధికారులకు రైతులు పూలమాలలు వేసి సన్మానించారు. వైసిపి మండల అధ్యక్షులు జి.భీమిరెడ్డి, ఇన్‌ఛార్జ్జీ/వ్యవసాయ సలహా మండలి అధ్యక్షులు విశ్వనాథ్ రెడ్డి, ఎఒ జీరా గణేష్, ఎఇఒ నరసింహుడు పాల్గొన్నారు.
ట్రాక్టర్‌ను అందజేస్తున్న నాయకులు










