May 19,2023 00:43

సులోచనా రాణి చిత్ర పటం నాయకుల నివాళి

ప్రజాశక్తి-బాపట్ల : తెలుగు నవలకు అక్షర నీరాజనం పలికిన రచయిత్రిగా పేరుగాంచిన యద్దనపూడి సులోచనారాణి సేవలు చిరస్మరణీయులని సాహితీ భారతి అధ్యక్షులు రావూరి నరసింహ వర్మ తెలిపారు. యద్దనపూడి సులోచన రాణి ఐదో వర్ధంతి సందర్భంగా సాహితీ భారతీయ ఆధ్వర్యంలో ఆమె చిత్రపటానికి పూల మాలవేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా వర్మ మాట్లాడుతూ సులోచనరాణి రచించిన 75 నవలు రచించినట్లు తెలిపారు. అందులో మీనా, సెక్రటరీ ,జీవన తరంగాలు, విచిత్రబంధం ,బంగారు కలలు, జై జవాన్‌ సినిమాలుగా తరకెక్కాయన్నారు. సాహితీ భారతి ఉపాధ్యక్షుడు మర్రి మాల్యాద్రిరావు మాట్లాడుతూ సులోచన రాణి మధ్య తరగతి కుటుంబాల్లోని బాంధవ్యాలు ఆత్మీయతా నురాగాలు ఆత్మస్థైర్యాలకు నవలల ద్వారా అక్షర రూపం కల్పించారన్నారు. ఆమె రచించిన కీర్తి కిరీటాలు నవలకు ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమీ అవార్డు, ఆత్మగౌరవం, కాంచన గంగ చిత్రాలకు నంది అవార్డులను అందుకున్నారన్నారు. ఈ కార్యక్రమంలో సాహితీ భారతి కోశాధికారి ఆదం షఫీ, ఎం.జాకబ్‌, ఎన్‌.కష్ణ ,కస్తూరి శ్రీనివాసరావు, బొడ్డుపల్లి శ్రీరామచంద్రమూర్తి, పువ్వాడ వెంకటేశ్వర్లు, రెంటాల మురళీ, రాధా కష్ణమూర్తి, అవ్వారి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.