
ప్రజాశక్తి - గుంటూరు జిల్లా విలేకర్లు : ప్రజారక్షణ భేరి బస్సు యాత్రకు తెనాలిలో ఘన స్వాగతం లభించింది. మున్సిపల్ కార్మికులు, వివిధ రంగాల్లో పనిచేస్తున్న శ్రామికులు నాయకులకు జేజేలు పలికారు. మార్కెట్ వంతెన నుండి మార్కెట్ కూడలిలోని అన్నాబత్తుని పురవేదికపై వరకు పూలు చల్లుతూ తీసుకెళ్లారు. అనంతరం జరిగిన సభకు సిపిఎం తెనాలి డివిజన్ కార్యదర్శి కె.బాబు ప్రసాద్ అధ్యక్షత వహించారు. యాత్ర బృందానికి సభా వేదికపై ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ యూనియన్, ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు, డాల్మిల్ వర్కర్స్ యూనియన్, ముఠా కార్మిక సంఘం, ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక, ది తెనాలి ఎంప్లాయిస్ అండ్ జిడిఎస్ మ్యూచువల్లీ ఎయిడెడ్ అండ్ క్రెడిట్ కో-ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్, మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. వీరిలో డిఎల్ కాంతారావు, ఆర్ శివకృష్ణ, వి.ఫణీంద్ర, ఎస్.సుబ్రహ్మణ్యం, కె.రవికుమార్ వివిధ ప్రజా సంఘాల నాయకులు ఉన్నారు. రాష్ట్ర నాయకులు నాయకులు వి.శివనాగరాణి, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎన్.భవన్నారాయణ, సీనియర్ నాయకులు ఎం.శివసాంబిరెడ్డి, హుస్సేన్‌వలి, నాయకులు ఎం.వెంకటేశ్వర్లు, పి.జోనేష్, ఎం.సాంబశివరావు, ఆర్.వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. తొలుత ప్రజానాట్య మండలి కళాకారులు తమ ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. పెరిగిన నిత్యావసరల ధరలు, సామాన్యులు పడుతున్న కష్టాలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, ప్రజలకు భారంగా మారిన విద్యుత్ చార్జీలు, పన్నుల భారాలను కళ్లకు కడుతూ గేయాలు ఆలపించారు. లయబద్దంగా అడుగులు వేస్తూ, వాయిద్యాలతో ఆలపించిన పాటలు ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తెనాలి పట్టణంతోపాటు పరిసర గ్రామాల నుంచి ప్రజలు, వివిధ రంగాలలోని కార్మికులు తిలకించారు. వివిధ రంగాల కార్మికులు తమ సమస్యలపై యాత్ర బృందానికి వినతిపత్రాలిచ్చారు.
గుంటూరు నగరానికి చేరిన యాత్రకు సిపిఎం నగర కమిటీ స్థానిక బిఆర్ స్టేడియం వద్ద ఘన స్వాగతం పలికింది. కార్యకర్తలు ఎర్ర చొక్కాలు ధరించి, జెండాలు చేతబూని, డబ్బు నృత్యాలతో ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం పాతబస్టాండ్ సెంటర్‌లో పార్టీ నగర కార్యదర్శి కె.నళినీకాంత్ అధ్యక్షతన బహిరంగ సభ నిర్వహించారు. సభకు ముందు ప్రజానాట్యమండలి కళాకారుల బృందం ఆలపించిన గేయాలు, నృత్యప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.
పెదకాకాని సెంటర్లో సభకు సిపిఎం మండల కార్యదర్శి ఎన్.శివాజీ అధ్యక్షత వహించగా జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు వై.నేతాజి, నాయకులు ఎం.శ్రీనివాసరావు, బి.బాబురావు, యు.శివయ్య, బి.సాంబయ్య, రాంబాబు, జె.అప్పిరెడ్డి, కె.యాకోబు, రాజ్యలక్ష్మి పాల్గొన్నారు.
మంగళగిరి మండలం కాజ టోల్‌గేట్ వద్ద యాత్రకు సిపిఎం కార్యకర్తలు, నాయకులు బస్సు యాత్రకు ఘన స్వాగతం పలికారు. యాత్ర బృందానికి పుష్ప గుచ్చాలు అందించారు. అనంతరం ర్యాలీగా కాజలోని సుందరయ్య నగర్ వరకు చేరుకొని నాయకులు బి.కోటేశ్వరి అధ్యక్షతన సభ నిర్వహించారు. రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ప్రభాకర్‌రెడ్డి, నాయకులు అచ్యుతరావు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఇ.అప్పారావు, నాయకులు కె.నాగేశ్వరరావు, ఎస్.సుమ, ఇ.ప్రతాపరెడ్డి, సత్యమారెడ్డి, మాధవరెడ్డి, సాంబిరెడ్డి పాల్గొన్నారు.
మంగళగిరి ఆటోనగర్ సమీపంలోని ఆల్ఫా హోటల్ వద్ద బస్సు యాత్రకు ఘన స్వాగతం పలికారు. నిమ్మగడ్డ రామ్మోహన్‌రావు విగ్రహం వద్ద జెండాను రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్.బాబూరావు ఆవిష్కరించారు. అనంతరం జరిగిన బహిరంగ సభకు సిపిఎం గుంటూరు జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎస్‌ఎస్ చెంగయ్య అధ్యక్ష వహించారు. బృందానికి ఆత్మకూరుకు నాయకులు వినతిపత్రం ఇచ్చారు. పోరంబోకు భూముల్లో ఇల్లు వేసుకుని నివాసం ఉంటున్న పేదలకు ఇళ్ల పట్టాలివ్వాలని, దళితులకు శ్మశాన స్థలం ఇవ్వాలని కోరారు. తమకు రూ.21 వేల వేతనం ఇవ్వాలని కార్పొరేషన్ విలీన గ్రామాల పారిశుధ్య కార్మికులు వినతిపత్రం ఇచ్చారు. సీనియర్ నాయకులు జెవి రాఘవులు, పి.బాలకృష్ణ, ఎం.పకీరయ్య, నాయకులు వివి జవహర్లాల్, టి.శ్రీరాములు, షేక్ జానీబాష, ఎం.చలపతిరావు, టి.శ్రీనివాసరావు పాల్గొన్నారు.
తాడేపల్లి సాయిబాబా గుడి వద్ద యాత్రకు సిపిఎం శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. అక్కడ నుంచి మోటార్‌సైకిల్ ర్యాలీతో ఉండవల్లి సెంటర్ వరకు బస్సుయాత్రగా తోడ్కొని వచ్చారు. అనంతరం సిపిఎం పట్టణ కార్యదర్శి బి.వెంకటేశ్వర్లు అధ్యక్షతన బహిరంగ సభ జరిగింది. తాడేపల్లి రైల్వే స్థలాల్లోని పేదలు అర్జీనివ్వగా దీనిపై ఎంఎ గఫూర్ మాట్టాడుతూ ప్రభుత్వం వెంటనే రైల్వేకు భూమి విలువ చెల్లించి అదే భూములకు అక్కడ నివాసం ఉంటున్న వారికి పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర కమిటీ సభ్యులు ఎం.సూర్యారావు, ప్రజా నాట్యమండలి రాష్ట్ర కార్యదర్శి ఎస్.అనిల్‌కుమార్, సిపిఎం సీనియర్ నాయకులు జొన్నా శివశంకరరావు, రూరల్ కార్యదర్శి డి.వెంకటరెడ్డి పాల్గొన్నారు. వేదికపైకి వక్తలను సిపిఎం రాజధాని డివిజన్ కార్యదర్శి ఎం.రవి ఆహ్వానించారు.