Oct 22,2023 22:03

క్యూ లైన్‌లోజనం



శ్రీ దుర్గాదేవి అలంకారంలో దుర్గమ్మ దర్శనం
ఆదివారం కావడంతో భారీగా తరలివచ్చిన జనం
ప్రజాశక్తి - వన్‌టౌన్‌ : ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజు ఆదివారం శ్రీ దుర్గాదేవిగా దుర్గమ్మ దర్శనమిచ్చారు.
అమ్మవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు
దుర్గాదేవి అలంకారంలో ఉన్న దుర్గమ్మను పలువురు ప్రముఖులు దర్శించు కున్నారు. మంత్రి కారుమూరి నాగేశ్వర రావు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు, రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంద్ర కుమార్‌, ఎపిఎస్‌పిఎఫ్‌ ఐజి టి.వెంకటరామి రెడ్డి, ఎన్టీఆర్‌ జిల్లా ప్రిన్సిపల్‌ జడ్జి అరుణ సారిక, హైకోర్టు న్యాయమూర్తులు కెఎల్‌ఎన్‌ఎస్‌ చక్రవర్తి, బి, కృష్ణమోహన్‌, ఎన్‌, విజయ, భానుమతి తదితర ప్రము ఖులు అమ్మవారిని దర్శించుకున్న వారిలో వున్నారు. రాష్ట్రంలో ప్రజలందరూ సర్వసంపదలతో సుభిక్షంగా ఉండేలా జగన్మాతను కోరుకున్నానని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. దుర్గాదేవి అవతారంలో దర్శనమిస్తున్న జగన్మాతను దర్శించుకునేందుకు శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానానికి వచ్చిన ఆయనకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. దర్శనానంతరం వేద పండితులు ఆశీర్వచనం అందించి, అమ్మవారి శేష వస్త్రం, ప్రసాదం, చిత్రపటాన్ని అందజేశారు.



దుర్గగుడికి బస్సు వితరణ
ప్రజాశక్తి - వన్‌టౌన్‌ : కార్పొరేట్‌ సామాజిక బాధ్యత (సిఎస్‌ఆర్‌)లో భాగంగా ఆదివారం కెనరా బ్యాంక్‌ యాజమాన్యం దుర్గాష్టమి రోజున యాత్రికులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించేందుకు వీలుగా రూ.24 లక్షల విలువ గల నూతన బస్సును శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానానికి అందజేశారు. కెనరా బ్యాంకు సర్కిల్‌ జనరల్‌ మేనేజర్‌ పి.రవి.వర్మ, ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు చేతుల మీదుగా దుర్గగుడి ఈవో కేఎస్‌ రామారావుకి బస్సు అందజేశారు. భవానీ ఘాట్‌ వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, దుర్గగుడి పాలకమండలి చైర్మన్‌ కర్నాటి రాంబాబు, బ్యాంకు ఉద్యోగులు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు, శాసనసభ్యులు శ్రీనివాసరావు మాట్లాడుతూ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల ఆలయానికి దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల సౌకర్యం కోసం కెనరా బ్యాంకు కార్పొరేటు సామాజిక బాధ్యతగా బస్సును అందించడం ఆనందించదగ్గ విషయమని.. ఇందుకు కెనరా బ్యాంకు యాజమాన్యానికి అభినందనలు తెలిపారు.
ఘనంగా శరన్నవరాత్రులు
ప్రజాశక్తి - వన్‌టౌన్‌ : దసరా శరన్నవరాత్రుల సందర్భంగా స్థానిక చిట్టినగర్‌లోని శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో అమ్మవారు దసరా ఉత్సవాల ఎనిమిదవ రోజైన ఆదివారం శ్రీదుర్గాదేవి అలంకారంతో దర్శనమిచ్చారు. తెల్లవారుజాము నుంచే దేవస్థానం యాత్రికులతో కిటకిటలాడింది. అమ్మవారిని ఎండోమెంట్‌ డిపార్ట్‌మెంట్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ శాంతి దర్శించుకుని పట్టు చీరను సమర్పించారు. ఆమెకు దేవస్థానం పాలకవర్గం స్వాగతం పలికి అమ్మవారి చిత్రపటాన్ని అందజేసి సత్కరించారు. ఎండోమెంట్‌ ఇన్‌స్పెక్టర్‌ అనురాధ, తెలుగుదేశం నాయకులు నాగుల్‌ మీరా, పెందుర్తి శ్రీనివాస్‌ తదితరులు అమ్మవారిని దర్శించుకోగా వారిని ఆలయ కమిటీ సముచిత రీతిన సత్కరించారు. ఈ సందర్భంగా శ్రీ నగరాల సీతారామస్వామి శ్రీ మహాలక్ష్మి అమ్మవార్ల దేవస్థానం కమిటీ అధ్యక్షులు లింగిపిల్లి అప్పారావు, కార్యదర్శి మరుపిళ్ళ హనుమంతరావు, కోశాధికారి పిళ్ళా శ్రీనివాసరావు, గౌరవ అధ్యక్షులు బెవర సూర్యనారాయణ మాట్లాడారు. రోజూ వేలాదిమంది అమ్మవారిని దర్శించుకుంటున్నారన్నారు. దసరా ఉత్సవాల కార్యక్రమంలో దేవస్థానం పాలక మండలి ఉపాధ్యక్షులు మరుపిళ్ళ సత్యనారాయణ, బెవర శ్రీనివాసరావు, సహాయ కార్యదర్శులు పొట్నూరి దుర్గాప్రసాద్‌, శీరం వెంకట్రావు, ఆర్గనైజింగ్‌ సెక్రటరీ కొరగంజి భాస్కరరావు, కార్యవర్గ సభ్యులు పోతిన బేసికంటేశ్వరుడు, పాల్గొన్నారు.
నందిగామ : నందిగామ పట్టణం 3వ వార్డులో దసరా శరన్నవరాత్రుల సందర్భంగా ఏర్పాటు చేసిన కనకదుర్గమ్మ అమ్మవారి విగ్రహాన్ని నందిగామ శాసన సభ్యులు మొండితోక జగన్‌ మోహన్‌రావు ఆదివారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. నందిగామ పట్టణంలో 18 వ వార్డులో దసరా శరన్నవ రాత్రుల్లో కనకదుర్గమ్మ అమ్మవారి విగ్రహానికి నందిగామ శాసన సభ్యులు మొండితోక జగన్‌ మోహన్‌రావు శనివారం రాత్రి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యేను విగ్రహ కమిటీ సభ్యులు శాలువాతో సత్కరించారు. 3వ వార్డు కౌన్సిలర్‌ ఖాలీక్‌, 18వ వార్డు కౌన్సిలర్‌ భండారు గంగానమ్మ, నందిగామ సొసైటీ చైర్మన్‌ పాములపాటి రమేష్‌, వైసీపీ నియోజక వర్గ నాయకులు యార్లగడ్డ సత్య నారాయణ ప్రసాద్‌, పారుపల్లి హరి, భండారు వెంకట్రావు, ప్రజా ప్రతినిధులు, వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, విగ్రహ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. నందిగామ 16వ వార్డు కనక దుర్గమ్మ దేవాలయంలో ఆదివారం రాత్రి కోలాటం పలువురిని ఆకట్టుకుంది. మహిళలు, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొని కోలాటం నత్యం ప్రజలను ఉత్సాహ పరిచింది. నందిగామ మండలంలో దేవి శరన్నవ్రత ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. దసరా ఉత్సవాల పురస్కరించుకొని ఎనిమిదో రోజు ఆదివారం అంబారుపేట శ్రీ సత్యమ్మ అమ్మవారు శ్రీ కనకదుర్గదేవిగా, పల్లగిరి గట్టుపై త్రిశక్తి పీఠంలో త్రిమాతలకు కనకదుర్గదేవిగా ప్రత్యేక అలంకరణలు విశేష కుంకుమార్చనలు మూలమంత్ర హౌమాోలు పూజలు నిర్వహించారు. నందిగామ పట్టణం శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో సుఖ శ్యామల అమ్మవారు, శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి శ్రీ చక్ర మందిరంలో శ్రీ వాసవి మాత, మరిడి మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలలో మహాలక్ష్మి దేవి కనక దుర్గాదేవిగా భక్తులకు దర్శనం ఇచ్చింది. వత్సవాయి : దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం అమ్మవారు శ్రీ దుర్గాదేవి గా దర్శన మిచ్చారు. వత్సవాయిలో వత్సవాయి అమ్మ తల్లి దేవాలయం, లింగాల ఉమామహేశ్వర దేవాలయం, చిట్యాల శ్రీ వెంకటేశ్వర దేవాలయం, మక్కపేట ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం, మంగోళ్ళు రామాల యం దేవాలయం, భీమవరం ఆర్యవైశ్య సంఘం వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విగ్రహాల వద్ద భక్తులే అమ్మవారికి ప్రత్యేక పూజా కార్య క్రమాలు నిర్వహిం చారు. ప్రతి రోజు అమ్మవారికి కట్టిన వస్త్రాలను రాత్రి సమయంలో పూజలు అయిన తర్వాత వేలంపాటలు నెరవేస్తు న్నారు. వేలంపాట ద్వారా చీరలను సొంతం చేసుకుంటున్నారు. మహిళలు సామూహిక కుంకుమ పూజలు నిర్వహించారు. వత్సవాయి గ్రామంలో మహమేరు శ్రీచక్ర వాసవి కన్యకా పరమేశ్వరి దేవి సహిత నవ ఉప ఆలయముల క్షేత్ర ప్రాంగణంలో శ్రీదేవి శరన్నవ రాత్రోత్సవంలో భాగంగా ఆదివారం దుర్గాష్టమి సందర్భంగా అత్యంత వైభవోపేతంగా శ్రీ చండీ హోమం నిర్వహించారు.
కంచికచర్ల : దసరా ఉత్సవాలు ఆదివారం 8వ రోజు ఘనంగా నిర్వహించారు. స్థానిక పశువుల ఆస్పత్రి రోడ్లో ఏర్పాటు చేసిన కనకదుర్గ విగ్రహాన్ని దుర్గాదేవిగా అలం కరించారు. ఈ సందర్భంగా మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అన్నదానం చేశారు. సొసైటీ అధ్యక్షుడు కాలవ పెదబాబు తదితరులు పాల్గొన్నారు. స్థానిక వసంత కాలనీలో విగ్రహాన్ని దుర్గాదేవిగా అలంకరించారు. ఈ సంద ర్భంగా అన్న దానం చేశారు. గని ఆత్కూరు, పరిటాల, మోగులూరు, గొట్టుముక్కల, కీసర తదితర గ్రామాల్లో విగ్రహాలను అలంకరించి పూజలు నిర్వహించారు.
మైలవరం : దసరా శరన్నవ రాత్రుల్లో భాగంగా స్థానిక కోట వెనుక ఉన్న కోట మహాలక్ష్మి ఆలయంలో అమ్మవారి నీ ఆదివారం 200 మంది సువాసినీలచే సామూహిక గౌరీ ఆరాధన జరిగింది. పూజల అనంతరం 108 రకాల ప్రసాదాలను అమ్మవారికి సమర్పించారు. అనంతరం భక్తులు తీర్థ ప్రసాదాలు స్వీకరిం చారు. ఇబ్రహీంపట్నం : దేవీ నవరాత్రులను పురస్క రించుకుని కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఏర్పాటు చేసిన విగ్రహాల వద్ద కొండపల్లి మున్సిపల్‌ చైర్మన్‌ అభ్యర్థి గుంజ శ్రీనివాసు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలో శ్రామిక నగర్‌లో కనకదుర్గ అమ్మవారి దేవాలయం వారు ఏర్పాటు చేసిన విగ్రహానికి, దుర్గా గణేష్‌ కమిటీ వారు ఏర్పాటు చేసిన విగ్రహానికి పూజలు నిర్వహించారు. అనంతరం కొండపల్లిలో మహాలక్ష్మి బొడ్డురాయి సెంటర్‌ యూత్‌ ఏర్పాటు చేసిన విగ్రహానికి పార్టీ నాయకులతో కలిసి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గుంజ శ్రీనివాసు అన్నసంతర్పణకు వారి సొంత నిధులతో కనక దుర్గమ్మ గుడికి రూ.10 వేలు, దుర్గా గణేష్‌ కమిటీకి రూ.10 వేలు, మహాలక్ష్మి అమ్మవారి బొడ్డు రాయి సెంటర్‌ యూత్‌ వారికి రూ. 10వేలు అంద జేశారు. ఈ కార్య క్రమంలో ఎన్టీఆర్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి కాండ్ర కొండ గురవయ్య, కొండ పల్లి మున్సి పాలిటీ అధ్యక్షులు మిక్కిలి శరభయ్య, కౌన్సిలర్‌ అడపా వెంకయ్య నాయుడు, పార్టీ నాయకులు కుమ్మరి శ్రీనివాసరావు, వి.సురేష్‌ ఆంజనేయులు పాల్గొన్నారు.
వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో శరన్నవరాత్రులు
కొండ పల్లి మున్సి పాలిటీలో వేంచేసి యున్న వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మ వారి శరన్నవ రాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహి స్తున్నారు. దేవి నవ రాత్రులను పురస్క రించుకుని కొండపల్లి వైసిపి ప్రతి నిధులు కొండపల్లి శ్రీ చెన్న కేశవ రామా లయంలో వేంచేసి ఉన్న వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మ వారిని దర్శించుకుని వేద ఆశీర్వ చనం తీసుకున్నారు. ఈ కార్య క్రమంలో మునిసిపల్‌ చైర్మన్‌ అభ్యర్థి గుంజ శ్రీనివాస్‌, కౌన్సిలర్స్‌ కుమ్మరి శ్రీనివాసు, అడపా వెంకయ్య నాయుడు, వైసిపి టౌన్‌ ప్రెసిడెంట్‌ మిక్కిలి శరభయ్య, జిల్లా జనరల్‌ సెక్రటరీ కాండ్ర కొండ గురవయ్య, దేవాలయ కమిటీ చైర్మన్‌ పల్లపోతు బ్రహ్మజీ పాల్గొన్నారు.
నృత్య ప్రదర్శన
జగ్గయ్యపేట: మండ లంలోని బలుసు పాడు శ్రీ గురుధాం ధర్మ క్షేత్రంలో శరన్నవ రాత్రి ఉత్స వంలో భాగంగా ఆదివారం శ్రీసత్యా కూచిపూడి డాన్స్‌ అకాడమీ ఆధ్వ ర్యంలో చిన్నారుల నాట్య ప్రదర్శన జరిగింది. శివశ్రీ గెంటేల వెంకట రమణ, వసంత లక్ష్మీ దంపతులు నత్యం చేసిన చిన్నా రులకు బాలా రాధన చేసి సత్కరించారు. అకాడమీ నిర్వాహకులు రామకష్ణ, కష్ణవేణి దంపతులను సత్కరించి అభినం దించారు. మండలం లోని మల్కాపురం గ్రామంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్య క్రమంలో జగ్గయ్యపేట నియోజకవర్గ ఇన్‌ఛార్జి శ్రీరాం రాజగోపాల్‌ పాల్గొన్నారు. అన్నదానాన్ని ప్రారంభించారు. పెనుగంచిప్రోలు : స్థానిక శ్రీ తిరుపతమ్మ అమ్మ వారి ఆలయంలో గల శ్రీ అంకమ్మ అమ్మవారి ఆలయ వెండి తాపడం తయారు నిమిత్తం కుక్కపల్లి. చెన్నకేశవ రావు 50, 116 రూపాయలు కష్ణాజిల్లా ఉయ్యూరు మండలం కడవకొల్లు గ్రామ వాస్తవ్యులు యాదవ రెడ్డి హరికష్ణ ప్రసాద్‌ కష్ణ జ్యోతి దంపతులు అన్నదాన పథకానికి రూ.10,116లు ఆలయ కార్య నిర్వహణ అధికారి డిప్యూటీ కలెక్టర్‌ కె.రమేష్‌ నాయుడు సూచనల మేరకు ఆలయ ఎఇఒ తిరుమలేశ్వర్రావు ఆలయ ఇన్‌స్పెక్టర్‌ బద్దుల కష్ణమోహన్‌కు విరాళమిచ్చారు. ఆలయ అర్చకులు ఆశీర్వచనంతీర్థ ప్రసాదాలు అందజేశారు.
ఫిట్స్‌ వచ్చిన చిన్నారికి చికిత్స
వన్‌టౌన్‌ : ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాల ఎనిమిదో రోజు శ్రీ దుర్గాదేవి అలంకారంలో దుర్గమ్మ దర్శన మిచ్చారు. అయితే దుర్గగుడికి అమ్మవారి దర్శనం కోసం ఆదివారం కుటుంబ సభ్యులుతో విచ్చేసిన ఓ చిన్నారికి క్యూ లైన్‌లో ఫిట్స్‌ రావడంతో వెంటనే చికిత్స అందించేందుకు పాలకమండలి చైర్మన్‌ కర్నాటి రాంబాబు తగిన ఏర్పాట్లను చేశారు.