ప్రజాశక్తి - ఆస్పరి
మండలంలోని యాటకల్లు గ్రామంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యను పరిష్కరించాలని ఎపి రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి హనుమంతు, మండల కార్యదర్శి రంగస్వామి కోరారు. మంగళవారం తహశీల్దార్ కుమార్ స్వామికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. యాటకల్లు గ్రామ పరిధిలోని సర్వే నెంబర్ 477/1బిలో 34 సెంట్ల భూమి గత 70 ఏళ్ల నుంచి 15 మంది రైతుల అనుభవంలో ఉందని తెలిపారు. ఆన్‌లైన్‌లో నోషనల్ ఖాతాగా ఉందని, రెగ్యులర్ ఖాతాగా మార్చాలని కోరారు. పట్టాదారు పాసు పుస్తకాలు, డి పట్టా కలిగి ఉన్నారని పేర్కొన్నారు. గతంలో కైరుప్పల ఎపిజిబి బ్యాంకులో రుణాలు తీసుకున్నారని తెలిపారు. నోషనల్ ఖాతా ఉండడంతో బ్యాంకులో రెన్యువల్ చేయడం లేదన్నారు. నోషనల్ ఖాతాలను రెగ్యులర్ ఖాతాలుగా మార్చి రైతులకు న్యాయం చేయాలని కోరారు. లేకపోతే రైతులను సమీకరించి పెద్ద ఎత్తున తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేపడతామని హెచ్చరించారు. డివైఎఫ్‌ఐ నాయకులు బలరాం, వీరేష్, రైతులు మునిస్వామి, సుధాకర్, లక్ష్మన్న, శ్రీనివాసులు పాల్గొన్నారు.
తహశీల్దార్‌కు వినతిపత్రం అందజేస్తున్న నాయకులు










