బాపట్ల జిల్లా కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందిస్తున్న సర్పంచ్, ఉప సర్పంచ్
ప్రజాశక్తి-ఇంకొల్లు రూరల్: ఇంకొల్లు మండలం దుద్దుకూరు గ్రామంలోని పరభూముల నుండి దుద్దుకూరు వాగుకు ఉత్తరముగా ఉన్న తూర్పు బాడవ భూములలో మద్దిరాల వాగు వరకు యరకాలువ మరియు వాటర్ షెడ్/చెక్ డ్యాం నిర్మాణం ఏర్పాటుకు బడ్జెట్ కేటాయించాలంటూ జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందించారు. భారీ నీటి పారుదల శాఖ కార్యదర్శి ఇచ్చిన మెమో, రైతుల లేఖలతో పాటు, ప్రభుత్వ గౌరవ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఇచ్చిన లేఖలను జిల్లా కలెక్టర్ రంజిత్ బాషాను కలిసి సర్పంచ్ మల్లెం శ్రీనివాసరావు, ఉప సర్పంచ్ మన్నె చింపిరయ్య, గోగినేని ప్రభు తదితరులు కలిసి వినతిపత్రాన్ని అందించారు.










