ప్రజాశక్తి - దుగ్గిరాల : మండల కేంద్రమైన దుగ్గిరాలలోని వ్యవసాయ మార్కెటింగ్ యార్డులో బుధవారం 2028 క్వింటాళ్ల పసుపు విక్రయాలు జరిగాయి. వారం రోజుల క్రితం నిల్వ చేసే వ్యాపారస్తులు మాత్రమే కొనుగోలు చేయగా ప్రస్తుతం ఎగుమతుల ఆర్డర్లు రావడంతో ఒక్కసారి కొనుగోళ్లు పెరిగాయి. స్థానిక వ్యాపారులు సైతం భారీ కొనుగోళ్లకు తెరలేపారు. మరోవైపు యార్డు పసుపు బస్తాలతో కిటకిటలాడుతున్నా ధరలు మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా స్థిరంగా ఉన్నాయి. బుధవారం ధరలు పసుపు కొమ్ములు కనిష్ట ధర రూ.4700, గరిష్ట ధర రూ.5600, సగటు ధర రూ.5360 కాగా దుంపలు కనిష్ట ధర రూ.4800, గరిష్ట ధర రూ.5455, సగటు ధర రూ.5360 పలికాయి.










