జెట్టీ వరకు వచ్చిన సముద్రతీరం అలలు
ప్రజాశక్తి -ములగాడ : యారాడ బీచ్‌లో అలల తాకిడి ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా రావడంతో గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. యారాడ రోడ్లు, జట్టి భవనం వరకు అలలు రావడంతో గ్రామస్తులు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. ఏ సమయంలో ఏం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు. ఈ భయంతో గ్రామానికి చెందిన కొందరు వలస వెళ్లిపోయారు. కొంతమంది గ్రామంలోనే ఉండి బిక్కుబిక్కుమంటున్నారు. విషయం తెలుసుకున్న పెదగంట్యాడ తహశీల్దార్ సుజాత యారాడ సముద్రతీరాన్ని, గ్రామాన్ని పరిశీలించారు. గ్రామస్తులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులు దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు.










