Aug 25,2023 22:09

ఫొటో : మాట్లాడుతున్న ఎంఇఒ మస్తాన్‌వలీ

యాప్‌లో పేర్లు నమోదు చేయాలి
ప్రజాశక్తి-ఉదయగిరి : గ్రాస్‌ ఎన్‌రోల్‌మెంట్‌ రేషియో యాప్‌లో మండలంలోని 5సంవత్సరాల నుండి 18 సంవత్సరాల లోపు ఉండే ప్రతి ఒక్కరూ నమోదై ఉండడంతో పాటు వారు చైల్డ్‌ ఇన్ఫో వెబ్సైట్‌ లేదా ఆన్‌లైన్‌లో ప్రతి ఒక్కరూ నమోదై ఉండే బాధ్యత టీచర్లపై ఉందని మండల విద్యాశాఖ అధికారి -1 షేక్‌ మస్తాన్‌వలీ తెలిపారు. శుక్రవారం గ్రాస్‌ ఎన్‌రోల్‌మెంట్‌ రేషియో, జగనన్న మనబడి నాడు-నేడు, జగనన్న విద్యా కానుకలపై క్లస్టర్‌ రిజర్వ్‌ మొబైల్‌ టీచర్లతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంచాయతీల వివరాలను తీసుకుని వారి సమాచారము సేకరించి తప్పనిసరిగా పాఠశాలలలో లేదా ఓపెన్‌ స్కూల్స్‌లో వారిని నమోదు చేయించే విధంగా బాధ్యత తీసుకోవాలని కోరారు. అదేవిధంగా మనబడి నాడు-నేడు పనులు జరుగుతున్న పాఠశాలలలో ప్రధానోపాధ్యాయులు కమిటీ సభ్యులు ఎప్పటికప్పుడు రికార్డులు పూర్తి చేసే విధంగా సహకారం అందించాలన్నారు. జగనన్న విద్యా కానుక వస్తువులు ఏయే పాఠశాలలకు ఎన్నెన్ని ఇచ్చాము.. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఇచ్చామా.. లేదా.. ఇంకా ఏయే పాఠశాలలకు ఏమి కావాలో సమాచారం సేకరించాలని పలు సూచనలు చేశారు.