వాషింగ్టన్ : అమెరికా టెక్ దిగ్గజం యాపిల్.. ఐఒఎస్ 15.4, ఐప్యాడ్‌ఒఎస్ 15.4ను వచ్చే వారం విడుదల చేయనుంది. మాక్ రూమర్స్ ప్రకారం.. ఈ ఏడాది ప్రారంభం నుండి అభివృద్ధి చేస్తోన్న ఐఒఎస్ 15.4 సరైన విడుదల తేదీని వెల్లడించలేదు. వచ్చే వారం విడుదల మాత్రమే తెలిపింది. ఈ న్యూ వెర్షన్‌లో ఐఫోన్ వినియోగదారులకు కొత్త ఫీచర్లు ఉండనున్నాయి. మాస్క్ వేసుకుని ఫేస్ ఐడిని వినియోగించి.. వినియోగదారులు తమ ఫోన్‌ను అన్‌లాక్ చేయగల సామర్థ్యం ఉంది. వినియోగదారుల కంటి చుట్టూ ఉన్న ప్రాంతాన్ని ప్రత్యేకంగా గుర్తించడానికి ఫేస్ ఐడి సిస్టమ్‌ను అప్‌డేట్ చేయగలిగామని, మాస్క్ ధరించినప్పుడు ఈ సమాచారాన్ని ఉపయోగించి ఫోన్ లాక్ తీయవచ్చునని యాపిల్ పేర్కొంది. కానీ ఈ ఫీచర్స్ ఐఫోన్ 12, ఆ తర్వాత వెర్షన్‌లకు మాత్రమే వర్తించనుంది.










