Dec 03,2022 23:06

ప్రజాశక్తి-ఏ కొండూరు
వెలుగు డిపార్ట్మెంట్లో యానిమేటర్స్‌గా విధులు నిర్వహిస్తున్న మహిళలపై రాజకీయ వేధింపులు ఆపాలని ఎన్టీఆర్‌ జిల్లా యానిమేటర్ల సంఘం గౌరవ అధ్యక్షురాలు ఎ. కమల అన్నారు శనివారం మండలంలోని చీమలపాడు గ్రామంలో ఎన్టీఆర్‌ జిల్లా యానిమేటర్ల మూడో మహాసభ ఆళ్ల ఉమాదేవి అధ్యక్షతన జరిగింది. ఈ సభలో కమల మాట్లాడుతూ యానిమేటర్ల పదవీ కాల పరిమితి మూడు సంవత్సరాల ను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. 15 డ్వాక్రా గ్రూపులలో లోపు ఉన్న సంఘాలకు 2021 ఏప్రిల్‌ నుండి జీతాలు పెండింగ్లో ఉన్నాయని, ఆ పెండింగ్‌ జీతాలను వెంటనే చెల్లించాలన్నారు. వివోఎల సమస్యలపై నిరంతరం ఆందోళనలో పోరాటాలు కొనసాగిస్తున్నామని, ఆందోళన కార్యక్రమాల్లో వివోఏలు అందరూ కలిసికట్టుగా కలిసి రావాలని పిలుపునిచ్చారు. వివోఏలకు కనీస వేతనం చెల్లించాలని ఉద్యోగ భద్రత లాంటి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. ఈనెల 15 16 తేదీల్లో సీఐటీయూ ఎన్టీఆర్‌ జిల్లా మహాసభలో విజయవాడలో జరుగుతున్నాయని వివోఏలు అందరూ పాల్గొని మహాసభలను జయప్రదం చేయాలని ఆమె కోరారు. మహాసభ అనంతరం యానిమేటర్ల నూతన జిల్లా కమిటీని ఎన్నుకున్నారు. ఎన్టీఆర్‌ జిల్లా నుతన కమిటీ గౌరవఅధ్యక్షురాలుగా ఏ కమల, ప్రధాన కార్యదర్శిగా ఆళ్ల ఉమాదేవి, అధ్యక్షురాలిగా షేక్‌ చాంద్‌ బేగం, ఉపాధ్యక్షురాలుగా ఎం విజయలక్ష్మి, కమిటీ సభ్యులుగా కే ఉమా, సహాయ కార్యదర్శిగా డి కళ్యాణి, షేక్‌ మున్షి, కోశాధికారిగా సిహెచ్‌ సురేష్‌తో సహా 15 మందిని నూతన కమిటీగా ఎన్నుకున్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఏ కొండూరు మండల కార్యదర్శి సిఐటియు మండల కార్యదర్శి జెట్టి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.