Aug 28,2023 23:43

యానిమేటర్లను వేధింపులకు గురిచేయొద్దు

తుళ్లూరు: సంబంధం లేని పనులు టార్గెట్‌ గా పెట్టి యానిమేట ర్లను వేధింపులకు గురి చేయవద్దని యానిమేటర్ల ఉద్యోగుల సంఘం సిఐటియు జిల్లా గౌరవాధ్యక్షులు దండా లక్ష్మీ నారాయణ అధికారులను కోరారు.మండలంలోని వి వో ఎ ల సమావేశం తుళ్ళూరులో విమల అధ్యక్షతన సోమవారం జరిగింది.ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, యానిమేటర్లకు రూ. 26,000 వేలు వేతనం ఇవ్వాలని, యాని మేటర్లకు మూడేళ్ల కాలపరిమితి, 45 సంవత్సరాల వయోపరిమితి తక్షణమే రద్దు చేయాలని కోరారు.మూడేళ్లు నిండినవారు వీవో లో తీర్మానం చేస్తేనే వేతనం వేస్తామని చెప్పడం సబబు కాదని అన్నారు. రాజకీయ వేధింపులు ఆపాలని కోరారు. యానిమేటర్ల ఉద్యోగుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వి విజయలక్ష్మి మాట్లాడుతూ, యాని మేటర్లకు జీతాన్ని వారి పర్సనల్‌ ఖాతాలోనే వేయాలని డిమాండ్‌ చేశారు. వివో ల మెర్జ్‌ విధానాన్ని ఆపాలని, యానిమేటర్లకు నిర్దిష్టమైన పని లేకపోవడం వల్ల ప్రతి పనికి యానిమేటర్ల ను బాధ్యులను చేయడం సరికాదని ,అర్హత మేరకు సీసీలుగా పదోన్నతి కల్పించాలన్నారు. గ్రేడింగ్‌ పద్ధతి మానుకోవాలని,కోళ్లు, గేదెలు,గొర్రెలు, విత్తనాలను బలవంతంగా యానిమేటర్‌ లతో అమ్మకాలు చేయించే విధానం సరికాదని అన్నారు. యానిమేటర్ల ప్రచార యాత్రలో భాగంగా సమస్యలపై ఎంపిడివో శివ న్నారాయణ,ఎపిఎం చిన వీరయ్యకు వినతి పత్రాలు ఇచ్చారు. కార్యక్రమంలో యానిమేటర్ల నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది.నూతన అధ్యక్ష, కార్యదర్శులుగా విమల, అనూష,కోశాధికారిగా అంజమ్మ, ఉపాధ్యక్షులుగా శిరీష, నాగమల్లేశ్వరి,అరుణ, సహాయ కార్యదర్శులుగా సరిత,సమాధానం, సంఘం గౌరవ అధ్యక్షులుగా యం భాగ్యరాజు లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.