పెదనందిపాడు రూరల్: యానిమేటర్లకు టార్గెట్ల్ పెట్టి వేధింపులకు గురి చేయడం సబబుకాదని యానిమేటర్స్ ఉద్యోగుల సంఘం సిఐటియు జిల్లా గౌరవాధ్యక్షులు దండా లక్ష్మీనారాయణ అధి కారులను డిమాండ్ చేశారు. కాకుమాను మండల యాని మేటర్ల సమావేశం స్థానిక మహిళా మండలి ప్రాంగణంలో శుక్రవారం నిర్వహించారు. సమావేశానికి జిల్లా యాని మేటర్ల సంఘం సహాయ కార్యదర్శి శివకుమారి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ యానిమేటర్లకు వేతనం రూ.26,000 ఇవ్వాలని, యాని మేటర్లకు మూడేళ్ల కాలపరిమితిని, 45 సంవత్సరాల వయో పరిమితిని తక్షణమే రద్దు చేయాలని కోరారు. స్వయం సహాయక గ్రూపులలో జరిగిన అవకతవకులకు ప్రతిదానికి యానిమేటర్లనేే బాధ్యులుగా చేయడం సరికాదని, వారిపై రాజకీయ వేధింపులు ఆపాలని, వాని జీతాన్ని వారి పర్సనల్ ఖాతాల్లోనే వేయాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని, ప్రమాద బీమా అమలు చేయాలని కోరారు. శివకుమారి మాట్లాడుతూ కోళ్లు, గేదెలు, గొర్రెలు, విత్తనాలను బలవం తంగా అమ్మాలని టార్గెట్ల్ పెట్టి వారిని వేధింపులకు గురి చేయడం సరికాదని అన్నారు. ఈ సందర్భంగా యాని మేటర్ల నూతన కమిటీని ఎన్నుకున్నారు. నూతన అధ్యక్ష కార్యదర్శులుగా ఎన్.రమాదేవి, సుబ్బాయమ్మ, కోశాధికారిగా షేక్ ఆశా, ఉపాధ్యక్షులుగా సుజాత, సరిత, సహాయ కార్య దర్శిగా అనూష, అమల సంఘం గౌరవాధ్యక్షులుగా కందుల శ్రీనివాసరావులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రదర్శన అనంతరం సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని ఎంపిపి, ఎండిఒ, ఎపిఎంలకు అందజేశారు.










