Aug 18,2023 00:36

మాట్లాడుతున్న పేరుబోయిన వెంకటేశ్వర్లు

చిలకలూరిపేట: యానిమేటర్లకు దాదాపు 6,7 నెల ల నుంచి ఇస్తున్న కొద్దిపాటి జీతాలు కూడా ఇవ్వక పోవడం అన్యాయమని సిఐటియు మండల కార్యదర్శి పేరుబోయిన వెంకటేశ్వర్లు అన్నారు. స్థానిక పండరీపురం లోని ఏలూ రు సిద్దయ్య విజ్ఞాన భవన్‌లో గురువారం జరిగిన మండల స్థాయి విఒఎల సమస్యలపై జరిగిన సమా వేశా నికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ అనేక సంఘాల( ఆశ, మధ్యాహ్నం, ఇతర సంఘాలు) వారికి ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చక పోతే పోరాటాల ద్వారా సాధించు కున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 44 కార్మిక చట్టాలను 4 లేబర్‌ కోడ్లుగా మార్చటాన్ని సమం జసం కాదని, వాటిని వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు.యానిమేటర్లకు చెల్లించాల్సిన బకాయి వేతనాలు వెంటనే ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించి చట్టబద్ధత తీసుకురావాలని, మూడేళ్ల కాలంలోనే పని చేయాలన్న నిబం ధనను వెంటనే రద్దు చేయాలని, కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. పెరిగిన ధరల దృష్ట్యా ప్రస్తుతం వారికి ఇస్తున్న రూ.8 వేలు చాలవని, అందువల్లే ఈ యాని మేటర్లు అప్పుల పాలవుతున్నారని అన్నారు. వీరికి కనీసం రూ.10 లక్షల బీమా సౌకర్యం కల్పించాలని, వారికి ఇచ్చే జీతాలు గ్రామ సం ఘాల ఖాతాల్లో వేయకుండా నేరుగా విఒఎల ఖాతాలకు జమ చేయాలని డిమాండ్‌ చేశారు. నాలుగేళ్ల క్రితం ఏర్పాటు చేసిన సచివాలయాల ఉద్యోగులను పర్మి నెంట్‌ చేసినప్పుడు సం వత్సరాల తరబడి పనిచేస్తున్న వీరిని ఎందుకు పర్మినెంట్‌ చేయరని ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. విఒఎలను నూతన యాపులతో పనులు చేయమనడం సబబు కాదని, అందుకు తగిన సౌకర్యాలను (కొత్త ఫోన్లను) వెంటనే ప్రభుత్వం కల్పించాలని డిమాండ్‌ చేశారు. అనుభవం కలిగిన విఒఎలను సీసీలుగా ఉద్యో గోన్నతి కల్పించాలని అన్నారు. అనంతరం నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఈ కమిటీలో అధ్యక్షురాలుగా నెలం ఏసుమ్మ, కార్య దర్శిగా తన్నీరు మస్తా నమ్మ, కోశాధికారిగా బొప్పుడి లక్ష్మి.,కమిటీ సభ్యు లతో పాటు 9 మందితో ఏక గ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సంఘానికి గౌర వాధ్యక్షులుగా పేరుబోయిన వెంకటేశ్వర్లును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సమావేశంలో ఏసురాజు పాల్గొన్నారు.