తాడికొండ: యానిమేటర్ల సమస్యలను తక్షణమే పరి ష్కరించాలని యానిమేటర్ల ఉద్యోగుల సంఘం సిఐటియు జిల్లా గౌరవాధ్యక్షులు దండా లక్ష్మీనారా యణ ప్రభు త్వాన్ని డిమాండ్ చేశారు.శుక్రవారం తాడికొండలో యానిమేటర్ల మండల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ యానిమేటర్లకు రూ. 10,000 వేతనం ఇవ్వాలని, యానిమేటర్లకు పెట్టిన మూడేళ్ల కాలపరిమితి, 45 సంవత్సరాల వయోపరిమితి తక్షణమే రద్దు చేయాలని కోరారు. స్వయం సహా యక గ్రూపులలో జరిగిన అవకతవకులకు యాని మేటర్లను బాధ్యులుగా చేయడం సరికాదని అన్నారు. రాజకీయ వేధింపులు ఆపాలని ఈ నెల 28 నుండి 31 వరకు జరిగే జీపు జాత కార్య క్రమాన్ని జయప్రదం చేయాలని యాని మేటర్లకు విజ్ఞప్తి చేశారు.కార్యక్రమంలో యాని మేటర్ల నూతన కమిటీని ఎన్నుకున్నారు.నూతన అధ్యక్ష కార్య దర్శులుగా పి.శివలక్ష్మి, డి.విజయలక్ష్మి, సహాయ కార్యదర్శిగా డి.అనూష, కోశాధికారిగా మేరీ కుమారి, ఉపా ధ్యక్షులుగా జి నిర్మల, దాసరి అనూష, సంఘం గౌరవ అధ్యక్షులుగా గాంధీ రామ్మోహన రావును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.










