Aug 23,2023 23:36

యానిమేటర్లతో దండా లక్ష్మినారాయణ, సాంబిరెడ్డి, హుస్సేన్‌వలి

తెనాలి: యానిమేటర్ల సమస్యలపై ప్రభుత్వం తక్షణమే స్పందించి పరిష్కరించాలని యానిమేటర్ల ఉద్యోగ సంఘం సిఐటియూ జిల్లా గౌరవాధ్యక్షులు దండా లక్ష్మినారాయణ డిమాండ్‌ చేశారు. బుధవారం తెనాలిలో అరుణ అధ్యక్షతన నిర్వహించిన యానిమేటర్స్‌ మండల సమావేశం లో దండా లక్ష్మీనారాయణ మాట్లాడారు. యాని మేటర్లకు కనీస వేతనం రూ.26వేలు చెల్లించాలని, వారి ఖాతాల్లో నేరుగా జమచేయాలని, యానిమేటర్లకు పెట్టిన మూడేళ్ళ కాలపరిమితి, 45 సంవత్సరాల వయోపరిమితి తక్షణమే రద్దు చేయాలన్నారు. పొదుపు సంఘాల్లో జరిగే ప్రతి పొరపాటుకు యానిమేటర్లనే భాధ్యులను చేయటం, వారిపై రాజకీయ వేధింపులు సరికాదన్నారు. అలాగే యానిమేటర్లకు రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ చెల్లించాలని, అర్హతలను బట్టి వారికి సిసిలుగా పదోన్నతి కల్పించాలన్నారు. ఈనెల 30 వరకూ జరిగే జీపు జాతాలను జయప్రదం చేయాలని యానిమేటర్లను ఆయన కోరారు. సమస్యలపై వినతి పత్రాన్ని ఎంపిడివో ఎల్‌ విజయాలక్ష్మణ్‌, ఏపిఎం కె.జయశ్రీలకు అందిం చారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు ములకా శివసాంబిరెడ్డి, షేక్‌ హుస్సేన్‌వలి పాల్గొన్నారు.
యానిమేటర్ల సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక
యానిమేటర్ల సంఘం నూతన కార్యవర్గాన్ని సమావేశంలో ఎన్నుకున్నారు. తెనాలి అధ్యక్ష, కార్యదర్శు లుగా అరుణకుమారి, హనుమాయమ్మ, కోశాధికారిగా ఎం.సత్యవతి, ఉపాధ్యక్షులుగా పూర్ణ కుమారి, శశికళ, సంఘం గౌరవాధ్యక్షులుగా షేక్‌ హుస్సేన్‌వలిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.