May 17,2023 16:26

రైతులకు అరటి సాగుపై అవగాహన కల్పిస్తున్న శాస్త్రవేత్తలు

యాజమాన్య పద్ధతులతో అధిక దిగుబడులు
- అరటి పరిశోధన శాస్త్రవేత్తలు
 ప్రజాశక్తి -  చాగలమర్రి

       అరటి సాగులో సరైన యాజమాన్య పద్ధతులు అవలంభిస్తే అధిక దిగుబడులు సాధించ వచ్చని వైఎస్ఆర్ హార్టికల్చర్‌ యూనివర్సిటీ అరటి పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు డాక్టర్ రేష్మ,డాక్టర్ సునీల్‌ కుమార్‌,దత్తా రెడ్డి లు తెలియజేసారు.మండలం లోని చిన్నవంగలి గ్రామంలో అరటిసాగుపై అవగాహన సదస్సు ను ఏర్పాటు చేసారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అరటి రైతులు నీటి యాజమాన్యం,ఎరువుల యాజమాన్యం పద్దతులు,సస్య రక్షణ చర్యలు సకాలంలో చేపడితే తక్కువ ఖర్చుతో మంచి దిగుబడులు సాధించవచ్చన్నారు.అరటి రైతులు అడిగిన సమస్యలకు పరిష్కారాలతో పాటు తగు సలహాలు,సూచనలు అందజేసారు.అనంతరం ఏపిసిఎన్‌ఎఫ్‌ వారి ప్రకృతి వ్యవసాయంలో నవధాన్యాల సాగు కు సంబంధించిన గోడపత్రికలు ఆవిష్కరించారు.కార్యక్రమం లో ఎంపిటిసి లక్ష్మీరెడ్డి,ఉద్యాన అధికారి నరేష్‌ కుమార్‌ రెడ్డి,విహెచ్‌ఏలు శ్రావణి,జయకృష్ణ,ఫరూక్‌,సిఎన్‌ఎఫ్‌ సిబ్బంది నరేష్‌,రైతులు పాల్గొన్నారు.