May 25,2023 15:44

ప్రజాశక్తి - పుత్తూరు టౌన్ : ప్రజలందరికీ సురక్షితమైన త్రాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యంగా పనిచేస్తుందని గ్రామా! నీటిపారుదల ఏఈ .వెంకట్ తరుణ్ తెలిపారు. గురువారం పుత్తూరు మండల కేంద్రంలోని మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయంలో నీటి నాణ్యత పరీక్ష శిక్షణ కార్యక్రమాన్ని ఎంపీడీవో ఇందిరమ్మ అధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఈ G వెంకట్ తరుణ్ మాట్లాడుతూ నాణ్యమైన నీటితోనే సంపూర్ణే.ఆరోగ్యం లభిస్తుందని తెలిపారు. ప్రభుత్వం ప్రతి గ్రామానికి నీటి.నాణ్యతలను పరీక్షించే పరికరాలను పంపిణీ చేసిందని వాటిని తప్పకుండా వినియోగించి ప్రజలందరికీ సురక్షితమైన నీరును అందించాలని సూచించారు. పంచాయతీ కార్యదర్యుడు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లకు, అంగన్ వాడి వర్కర్లు మరించి ఆశా వర్కర్లకు, సురక్షితమైన తాగునీరు వల్ల కలిగే ప్రయోజనాలు మరియు పరీక్ష విధానాలను వివరించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు సిబ్బందులు పాల్గొన్నారు.