ప్రజాశక్తి-వి కోట : శ్రీ దేవి నవరాత్రులు సందర్భంగా వీకోట పట్టణంలోని దుర్గామాత ఆలయంలో జరుగుతున్న దసరా నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఆదివారం 1808 పాలకళాశాలతో వేణుగోపాల స్వామి దేవాలయం నుండి లాంగ్ బజార్ మీదుగా దుర్గామాత ఆలయం వరకు మహిళలు పెద్ద ఎత్తున ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ తో పాటు,పలమనేరు ఎమ్మెల్యే వెంకటేగౌడ, ఎంపీపీ యువరాజ్ దంపతులు పాల్గొన్నారు. వేణుగోపాల స్వామి దేవాలయం వద్ద ఉదయం పాల కలిశాలకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి మహిళలు సాంప్రదాయ దుస్తులతో పాల కలిశాలను తలపై పెట్టుకుని పట్టణంలో ప్రదర్శనగా దుర్గామాత ఆలయానికి చేరుకున్నారు. ఆలయ ధర్మకర్త సుబ్రహ్మణ్యం ,మాజీ ధర్మకర్త దామోదర్ రెడ్డి ల ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు మహిళలు తీసుకొచ్చిన పాలకశాలను అమ్మవారికి సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. సాంప్రదాయాలను భావితరాలకు అందించే లక్ష్యంతో ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయని ఎమ్మెల్యే, జడ్పీ చైర్మన్లు తెలిపారు. ఈ సందర్భంగా ప్రజలకు వారు దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా త్రాగనీరు, మజ్జిగ, ఉచిత అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా పట్టణంలో ట్రాఫిక్కు ఇబ్బందులు కలగకుండా వీకోట అర్బన్ సి ఐ లింగప్ప ఆధ్వర్యంలో పటిష్ట పోలీస్ బందోబస్తు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ పిఎన్ లక్ష్మీతోపాటు పలువురు ప్రజాప్రతినిధులు పుర ప్రముఖులు, మండల పరిధిలోని వివిధ గ్రామాల నుండి పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు










