Oct 13,2023 14:27

ప్రజాశక్తి-మండపేట : మండపేటను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లి  క్రీడారంగంలో అవార్డు సాధించి దక్షిణాఫ్రికాలో మండపేటకు పేరు ప్రాక్యతలు  తెచ్చి నేషనల్ టెన్నిస్ క్వయిట్ పోటీల్లో స్వర్ణ పతాకం సాధించిన మండపేట కు చెందిన ఆటగాళ్లు వినయ్, రామారావులను వెలమ నాగవంశీకుల రామాలయం కమిటీ సభ్యులు బొడ్డు రామకృష్ణ, కాళ్ల నాగబాబు, రామాలయం కమిటీ ఆధ్వర్యంలో, వినయ్ రామారావులను రామాలయం కమిటీ ఘనంగా సత్కరించారు. దక్షిణాప్రికాలో భారత్ విజయం సాధించడం భారత బృందం తరఫున ఆడిన వారిలో మండపేటకు చెందిన క్రీడాకారులు వినయ్ రామారావులను వారు సాలువాలు కప్పి పూలమాలతో సత్కరించి విద్యార్దులకు మెమొంటోళ్లు అందజేశారు. భారత తరఫున ఆడి మన మండపేటకు పేరు ప్రఖ్యాతలు సాధించి మండపేట పట్టణానికి ఆణిముత్యం లాంటి వారు ఇరువురు దేశ ఖ్యాతిలో మండపేట ఘనత నిలబెట్టిన మీరు ఇరువురికి దక్కుతుందని అలాగే ఆసియాక్రీడల్లో భారత్ తరుపున వివిధ క్రీడలలో సుమారు 107 పతకాలు సాధించిన వారందరకీ అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వెలమ నాగవంశీకుల  కమిటీ సభ్యులు బొడ్డు రామకృష్ణ, కాళ్ల నాగబాబు, జొన్నపల్లి సూర్యరావు  అండ్ సన్స్, శీతిని సూరిబాబు,గోమాడ రామారావు, గోమాడా శ్రీను, గొర్రెల సత్యనారాయణ, రెడ్డి రామకృష్ణ, ప్రసాదు తదితరులు క్రీడాకారులు వినయ్, రామారావులకు  వెలమ నాగ వంశీకుల  రామాలయం కమిటీ సభ్యులు అభినందనలు తెలియజేశారు.