- ఎంపిడిఓ జాన్ లింకన్, ఈవోపీఆర్డీ రాజ్ కుమార్.
ప్రజాశక్తి - ఆలమూరు : ప్రజల ఆరోగ్యం కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజారోగ్య పథకాల్లో వైద్య ఆరోగ్య శాఖ, అంగన్వాడిలు సంయుక్తంగా చేస్తున్న సేవలు ఎనలేనివని ఎంపిడిఓ కె.జాన్ లింకన్, ఈవోపిఆర్డి రాజ్ కుమార్ వైద్యాధికారులు డాక్టర్ పి.భవాని శంకర్, డాక్టర్ సువర్చల, డాక్టర్ ప్రసన్న, డాక్టర్ మౌళి, డాక్టర్ శ్రీలక్ష్మి కొనియాడారు. మండలంలోని సూర్యారావుపేటలో "జగనన్న ఆరోగ్య సురక్ష" సర్పంచ్ చింతపల్లి వెంకటలక్ష్మి, వైసిపి నేత చింతపల్లి నాగేశ్వరరావు, వైస్ ఎంపిపి నెలపూడి రత్నకుమారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శిబిరంలో అంగన్వాడీలు ఉత్తమ పౌష్టికాహార ప్రదర్శనను వారంతా క్షుణ్ణంగా పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గర్భిణీలు, బాలింతలు చిన్నారుల విషయంలో వారు మంచి శ్రద్ధ తీసుకుంటున్నారన్నారు. గర్భిణీలపై మరింత శ్రద్ధ తీసుకొని ఏ ఒక్క శిశువును నష్టపోకుండా ప్రత్యేకమైన దృష్టి సారిస్తు చర్యలు తీసుకోవాలని వారు సూచించారు. వృద్ధులు చిన్నారుల విషయంలో అత్యంత జాగ్రత్తలు తీసుకోవాలని వారన్నారు. ఏమైనా క్లిష్టమైన సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని వారు కోరారు. అనంతరం వారి పర్యవేక్షణలో సుమారు 500 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి, ఉచిత మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అంబటి ప్రవీణ్ కుమార్, వైసీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడు కడలి ఉపేంద్ర, కార్యదర్శి సిహెచ్.వెంకటరెడ్డి, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ రాధాకృష్ణ, సూపర్వైజర్లు శివప్రసాద్, నాగలక్ష్మి, విఆర్వో రాజశేఖర్, అంగన్వాడీలు తదితరులు పాల్గొన్నారు.










