Feb 18,2022 18:18

వాట్సాప్ యూజర్లకు మరో ఆసక్తికరమైన ఫీచర్ రాబోతుంది. ప్రస్తుతం వాట్సాప్ లో వాయిస్ మెసేజ్ ని ప్లే చేస్తూ.. మధ్యలో వేరే చాట్ కి వెళ్తే ఆ వాయిస్ ఆగిపోతుందన్న సంగతి తెలిసిందే. ఇది యూజర్లకు కొంత ఇబ్బందిగా కూడా పడుతున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని తాజాగా వాయిస్ ఫీచర్ ను తెచ్చింది వాట్సాప్. వాయిస్ మెసేజ్ లేదా ఆడియో ఫైల్ ను వింటూ... మరొకరితో చాట్ చేయవచ్చు. అంతేకాదు.. వాట్సాప్ యాప్ నుండి బయటకు వచ్చినా బ్యాక్ గ్రౌండ్ లో ఆ ఫైల్స్ వినవచ్చు.  iOS వెర్షన్ 22.4.75 ఫోన్లో డిఫాల్ట్ గా వచ్చే వాట్సాప్ లో దీనికి సంబంధించి కొత్త ఫీచర్ ను గుర్తించినట్లు టెక్ నిపుణులు చెబుతున్నారు. భారతదేశంలోని వినియోగదారులకు సైతం ఇది అందుబాటులో ఉందని సమాచారం.