Jan 04,2023 12:03

ప్రజాశక్తి-అల్లూరి : జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అదికారంలోకి వచ్చిన తరువాత దళితుల గిరిజనుల సంక్షేమ పధకాలకు, స్కీములకు మంగళం పాడారని ఆంధ్రప్రదేశ్ వ్వవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి డి వెంకన్న పేర్కొన్నారు. బుధవారం అయిన ఓప్రకటన విడుదల చేశారు. భారతదేశానికి స్వతంత్రరం వచ్చిన తరువాత అట్టడుగు వర్గాల అబివృద్ది కోసం పెట్టిన సంక్షేమ పథకాలు స్కీములకు సైతం మంగళం పాడిన ఘనత ఈప్రభుత్వానికి దక్కిందన్నారు. దళితులు గిరిజనులు పట్ల ఈప్రభుత్వం ఎంత చులకన బావనతో ఉందో అర్దమౌతుందని తెలిపారు. గడిచిన ఎన్నికల్లో అత్యధిక ఓట్లు సీట్లు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి కట్టబెట్టింది దళితులు గిరిజనులైనని గుర్తుచేశారు. వెంటనే దళితులు గిరిజనులు, సంక్షేమ పథకాలు స్కీములు కోనసాగించడం ద్వారానే వారిని అబివృద్ది సాద్యమోతుందని తెలిపారు. 

  • డిమాండ్లు : 

1. ఎస్.సి., ఎస్.టి.లకు ప్రమోషన్లలో రిజర్వేషన్ అమలుకు నిరాకరణ.
2. ఎస్.సి., ఎస్.టి. అత్యాచార నిరోధక చట్టం అమలు విషయంలో సుప్రీం కోర్టు తీర్పును అనుసరించి 41 సి.ఆర్.పి.సి. నోటీసులు ఇవ్వకుండా ప్రభుత్వం ఇంతవరకూ ఉత్తర్వుల జారీ చేయలేదు. అందువలన నిందితులు స్టేషన్ బెయిల్ పొందుతున్నారు. బహుజనులకు ఎస్.సి., ఎస్.టి., బి.సి. మరియు మైనారిటీలకు 60 కార్పొరేషన్లు ఏర్పాటుచేసి ఒక్క లోను కూడా మంజూరు చేయకపోవడం.
4. భూమి కొనుగోలు పథకం రద్దు 5. బెస్ట్ అవైలబుల్ స్కీమ్ రద్దు
6. కులాంతర వివాహాల ప్రోత్సాహకం రద్దు

7. అంబేద్కర్ విదేశీ విద్యా స్కీమ్ రద్దు
8. ఎస్.సి. కార్పొరేషన్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం బ్యాంక్ లింక్డ్ లోన్స్ రద్దు 9. స్టడీ లీవ్ రద్దు.పూర్వ స్థితిని తొలగించుట
10. ఎ.పి. స్టడీ సర్కిల్ రద్దు
11. బుక్ బ్యాంక్ స్కీమ్ రద్దు
12. వేల కోట్ల నిధులు బదలాయింపు.గత కమ్మ, రెడ్ల యేడు సంవత్సరాల పాలనలో లక్ష కోట్ల పైగా ఎస్.సి.ఎస్.టి.సబ్ ప్లాన్ నిధులు బదలాయింపు.
13. ఎస్.సి.ఎస్.టి.అసైన్డ్ భూములు స్వాధీనం
14. ప్రధానమంత్రి ఆదర్శ్ గ్రామ యోజన (పి.ఎమ్.జి.వై.), ఎస్.సి. జనాభా 50% ఉన్న ఎస్.సి. కులాల మెజారిటీ గ్రామాల సమగ్ర అభివృద్ధి కోసం కేంద్ర ప్రాయోజిత పైలట్ పధకం,ప్రధానమంత్రి ఆదర్శ్ గ్రామ యోజన" (పి.ఎమ్.జి.) రద్దు. 15. నేషనల్ షెడ్యూల్డ్ కాస్ట్ ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే స్కీమును రెండున్నర సంవత్సరాల నుండి ఒక్కలోనూ ఇవ్వబడలేదు.
16.నేషనల్ సఫాయి కర్మచారీ ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే స్కీమును రెండున్నర సంవత్సరాల నుండి ఒక్కలోనూ ఇవ్వబడలేదు. 17. స్టాండఫ్ ఇండియా ద్వారా ఎస్.సి.ఎస్.టి. ఎస్.సి.,ఎస్.టి.లకు రుణాలు ఇచ్చే కేంద్ర ప్రభుత్వ పధకాల రద్దు.
18. జి.ఓ.ఎం.ఎస్. నెంబర్ 77 ద్వారా జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన ద్వారా కన్వీనర్ కోటా మినహాయించి మిగతా ఏ కోర్సులో చేరినా, వారికి ఉపకార వేతనాలు ఉండవని 77 జి.ఓ.లో పేర్కొన్నారు.
19. ఎస్.సి., ఎస్.టి. బాక్ లాగ్ పోస్టులు అన్నీ ప్రకటించకపోవడం.
20. బహుజనుల పిల్లలకు విద్య దూరం చేయడానికి సర్క్యులర్ నెంబర్ 172 జారీ చేయడం.
21. 34 లక్షల ఇళ్ల స్థలాలు ఇచ్చే క్రమంలో, పదకొండు వేల ఎకరాల అసైన్డ్ భూములను స్వాధీనం 22. మెడికల్ సీట్ల భర్తీలో బి కేటగిరి, సి కేటగిరీ సీట్లకు రిజర్వేషన్ వర్తింపచేయకపోవడం.
23. నూతన పారిశ్రామిక విధానము ద్వారా బహుజనులకు రుణాలు మంజూరు చేయకపోవడం. 24. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ స్కీము రద్దు. మెమో నెంబరు: 1214, తేది : 10-03-2020 చేసుకోవడం.
25 ప్రభుత్వ కార్యాలయాలలో, వైద్యశాలలలో, విద్యాలయాలలో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ శానిటరీ వర్కర్లకు సంవత్సరాల తరబడి జీతాలు ఇవ్వడం లేదు.
26. మైనారిటీ సోదరుల షాదీ ముబారక్ స్కీములు రద్దు చేయడమే కాక డైరెక్ట్ బ్యాంక్ లోన్లు నిలుపుదల.

27. ఎస్.సి., ఎస్.టి. బ్యాక్ లాగ్ పోస్టులు అభ్యరులు లేరనే సాకుతో జనరల్ కేటగిరీకి మార్చడం.వంటి చర్యలు,ధళతులు గిరిజనులు మరింత వెనుక బాటు తనానికి దారి తీస్తున్నాయనీ వెంటనే ప్రభుత్వం వీటిని కోనసాగించాలని లెని ఎడల ఈప్రభుత్వానికి తీవ్ర నష్టం కలుగుందని వెంకన్న స్పష్టం చేశారు,