
- జీపీఎస్ విధానం ఆమోదయోగ్యం కాదు
- -ఏపీటీఎఫ్ జిల్లా కార్యదర్శి కుమార్ యాదవ్
ప్రజాశక్తి-కలికిరి : జిపిఎస్ విధానం ఆమోదియోగ్యం కాదు ఓ పి ఎస్ మాత్రమే అంగీకరిస్తామని అన్నమయ్య జిల్లా ఏపీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కుమార్ యాదవ్ అన్నారు. ప్రభుత్వం ఓ పి ఎస్ రద్దుచేసి జిపిఎస్ ను ప్రవేశపెట్టడానికి అసెంబ్లీలో ఆమోదం తెలపడంతో మనల్ని ఉద్యోగ సంఘాలు తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి. ఈ సందర్భంగా కుమార్ యాదవ్ మాట్లాడుతూ ఉద్యోగభద్రత కల్పించే ఓపిఎస్ విధానం తప్ప మరే విధానాన్ని ఉపాధ్యాయులు ఆమోదించరని తెలిపారు. వారం రోజుల్లో సీపీఎస్ రద్దుచేసి ఓపిఎస్ అమలు చేస్తామని ఎన్నికల వేళ పదేపదే ఇచ్చిన హామీని అధికారంలోకొచ్చాక తప్పక నెరవేరుస్తారని ఆశించిన ఉద్యోగుల నమ్మకాన్ని వమ్ము చేశారని, హామీ విస్మరించి ఉద్యోగ ఉపాధ్యాయులు కు నష్టం కలిగించే జీపీఎస్ విధానాన్ని బలవంతంగా అమలు చేస్తున్నారని ఉపాధ్యాయులు ముక్థకంఠతో నిరసించారు. తామిచ్చిన హామీ నెరవేర్చుతారని ఉద్యోగులు, కుటుంబసభ్యులు ఎంతగానో విశ్వశించామని, ఐతే అందుకు విరుద్దమైన, ఆమోదయోగ్యం కాని జిపీఎస్ విధానాన్ని బలవంతంగా అమలు చేస్తున్న తీరును వ్యతిరేకిస్తూ ఫ్యాఫ్టో పిలుపు మేరకు కలికిరి పట్టణంలో ఏ పి టి ఎఫ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇటీవలే ఐదారు రాష్ట్రాలు పాత పెన్షన్ విధానాన్ని అమలుచేసే దిశగా కార్యచరణ చేస్తుంటే, బలంగా హామీ ఇచ్చిన మన ప్రభుత్వం మాత్రం మాటతప్పుతున్నదని, సమంజసం కాదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తామిచ్చిన హామీతో పాటు ఉపాధ్యాయ ఉద్యోగుల కు నష్టం జరగడాన్ని నివారించాలని కుమార్ యాదవ్ సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు నీలకంఠ, అజంతుల్లా, మహేష్ , శ్రీనివాసులు, ప్రతాప్, గురుప్రసాద్, రాజేంద్రప్రసాద్, జయరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.