Jun 23,2023 15:00
  • కూలేందుకు సిద్దంగా ఓవర్ హెడ్ ట్యాంక్

ప్రజాశక్తి - గూడూరు : గూడూరు పట్టణం లోని సొసైటీ(వాలయనందపురం)ప్రాంతంలో ఓవర్ హెడ్ ట్యాంక్ ఏ క్షణంలో నైనా కూలేందుకు సిద్దంగా ఉంది. రాణిపేట, సొసైటీ, నెహ్రూ నగర్, మఠం వీధి, వాలయనంద పురం ప్రాంతాలకు మంచి నీటి సరఫరా అందించే ఈ వాటర్ ట్యాంక్ నిర్వహణ లోపంతో పూర్తి శిథిలావస్థకు చేరుకుంది.ట్యాంక్ శుభ్రం చేసేందుకు వీలు లేకుండా ట్యాంక్ పైకి వెళ్ళే మెట్లు పూర్తిగా ధ్వంసం అయ్యాయి...ట్యాంక్ ను శుభ్రపరిచి యేళ్లు గడుస్తుండటంతో ట్యాంక్ నీటిని వాడుకునేందుకు స్థానికులు విముకుత వ్యక్తం చేస్తున్నారు.నీటిని వినియోగించక పోవడంతో ట్యాంక్ లో నీటి నిల్వలు పేరుకు పోయి ఏ సమయంలో అయినా కూలే స్థితిలో ఉంది.ఈ ట్యాంక్ ఏర్పాటైన ప్రాంతం లోనే పాఠశాలలు,నివాసాలు వుండటంతో స్థానికులు భయాందోళన లో బిక్కు బిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు.మునిసిపల్ అధికారులు వెంటనే స్పందించి పాత ట్యాంక్ ను పరిశీలించి దాని స్థానంలో నూతన ట్యాంక్ నిర్మాణానికి చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.