- కొత్త వాటర్ ట్యాంక్ నిర్మించాలంటూ గిరిజనులు వేడుకోలు.
ప్రజాశక్తి-రాజవొమ్మంగి : మండలంలోని చికిలింత పంచాయితీ కరుదేవ్ పాలెం గ్రామంలో రక్షిత తాగునీటి పథకం శిథిలావస్థకు చేరి గిరిజనులు తాగునీటికి ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో గ్రామంలో కొత్తగా వాటర్ ట్యాంక్ నిర్మించాలంటూ గిరిజనులు వేడుకుంటున్నారు. కరుదేవుపాలెం గ్రామంలోని సుమారు150 కుటుంబాలకు చెందిన 600 మందికి పైగా జనాభా నివసిస్తున్నారు. గ్రామంలో ఆరు చేతిపంపులు ఉండగా వాటిలో 3 సక్రమంగా పనిచేయవు, గ్రామంలో సుమారు 15 ఏళ్ల క్రిందట ఆర్ డబ్ల్యూఎస్ శాఖ ఆధ్వర్యంలో 10వేల లీటర్ల సామర్థ్యం కలిగిన రక్షిత తాగునీటి పథకం ఏర్పాటు చేశారు. నాటి నుండి నేటి వరకు ఎటువంటి మరమ్మత్తులుకు నోచుకోలేని గ్రామ సర్పంచ్ కోండ్ల సూరిబాబు గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, వాటర్ ట్యాంక్ శిధిలమై పెచ్చులు ఊడి కింద పడడంతో బాటు వాటర్ ట్యాంక్ లో నీరు లీకై వృధాగా పోతుంది తప్ప గ్రామానికి సక్రమంగా తాగునీరు అందడం లేదని, వాటర్ ట్యాంక్లో నీరు అపరిశుభ్రంగా ఉండడంతో వాటర్ ట్యాంక్ ని క్లీన్ చేద్దామన్న శిధిలావస్థకు చేరుకోవడంతో పైకి ఎక్కితే ఏమైనా జరుగుతుందేమోనని గిరిజనులు భయాందోళనకు గురవుతున్నారు. దీంతో ఆ నీరు వాడడం వలన అనారోగ్యం బారిన పడే ప్రమాదం ఉందని సర్పంచ్ కొండ్ల సూరిబాబు ఆవేదన వ్యక్తం చేశారు, ప్రజలు ఇబ్బందులు నేపథ్యంలో అధికారులు స్పందించి తక్షణం గ్రామంలో కొత్త వాటర్ ట్యాంక్ నిర్మించాలని కోరుతున్నారు.
- కొత్త వాటర్ ట్యాంక్ నిర్మించాలి
కారుదేవుపాలెం గ్రామంలో రక్షిత మంచినీటి పథకం శిథిలావస్థకు చేరి గిరిజనులు తాగునీటికి ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ప్రభుత్వం, అధికారులు తక్షణం స్పందించిగ్రామంలో కొత్త వాటర్ ట్యాంక్ నిర్మించాలి.
- కొండ్ల సూరిబాబు, గ్రామ సర్పంచ్, చికిలింత పంచాయితీ.










