
- విజేతలకు నగదు బహుమతులు
- వాలీబాల్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి భగవాన్ దాస్,నిర్వాహకులు కనకల కృష్ణ
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : శ్రీ పైడితల్లి అమ్మవారి జాతర సందర్భంగా ఈ నెల 29,30 తేదీల్లో స్థానిక రాజీవ్ క్రీడా ప్రాంగణంలో ఉత్తరాంధ్ర వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుందని నిర్వాహకులు కనకల.కృష్ణ, రాష్ట్ర వాలీబాల్ అసోసియేషన్ కార్యదర్శి భగవాన్ దాస్ లు తెలిపారు. బుధవారం రాజీవ్ గాంధీ క్రీడా ప్రాంగణంలో ఉన్న వాలీబాల్ కోర్టులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఉత్తరాంధ్ర కల్పవల్లి శ్రీ పైడితల్లి అమ్మవారి జాతర సందర్భంగా కనకల.యార్రయ్య జ్ఞాపకార్థం ఈ పోటీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ పోటీలకు తూర్పు గోదావరి,పశ్చిమ గోదావరి,శ్రీకాకుళం,విజయనగరం, భోగాపురం, ఎస్ కె అకాడమీ కొత్తవలస జట్లు పాల్గొంటాయి అని తెలిపారు. రెండు రోజుల పాటు ఫ్లడ్ లైట్ల వెలుతురులో పోటీలు జరగనున్నాయి అని తెలిపారు. పోటీలో విజేతగా నిలిచిన జట్టు కు 20000, ద్వితీయ స్థానం 15000, తృతీయ స్థానానికి 10000, నాల్గవ స్థానంలో నిలిచిన జట్టుకు 5000 నగదు బహుమతులు ఇవ్వడం జరుగుతుందన్నారు. వచ్చే జట్లుకు యూనిఫారం అందరికీ ఇవ్వడం జరుగుతుందన్నారు. రెండు రోజుల పాటు జరిగే పోటీలను విజయవంతం చేయాలని కోరారు.విలేకర్ల సమావేశంలో వాలీబాల్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.