ప్రజాశక్తి - పుత్తూరు టౌన్ : పట్టణంలోని సిఐటియు ఆధ్వర్యంలో పిడిఎఫ్ ఎమ్మెల్సీలు మీగడ వెంకటేశ్వర రెడ్డి, పోకిరెడ్డి బాబురెడ్డిలను గెలిపించాలని ప్రభుత్వ డిగ్రీ కాలేజీ, జూనియర్ కాలేజీ, ఎల్ఐసి ఆఫీసు, బ్యాంకు ఎంప్లాయిస్ లో ప్రచారం విస్తృతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి ఆర్ వెంకటేష్ మాట్లాడుతూ శాసనమండలిలో ప్రభుత్వ ఉద్యోగ సమస్యల పైన, లక్షల సమస్య పైన కాంటాక్ట్ అవుట్సోర్సింగ్ వారి సమస్యల పైన ప్రైవేట్ విద్యాసంస్థలపైన ఉపాధ్యాయ సమస్యల పైన అనేక పోరాటాలు చేశారని గుర్తు చేశారు అట్లాంటి అభ్యర్థులను శాసనమండలికి పంపించాలని ఆయన కోరారు. అందరికీ విద్య వైద్యం అందుబాటులోకి రావాలంటే పిడిఎఫ్ ఎమ్మెల్సీలను గెలిపించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎల్ఐసి యూనియన్ నాయకులు లక్ష్మణ్ కుమార్, షణ్ముగం, దస్తగిరి తదితరులు పాల్గొన్నారు.










