Feb 26,2023 17:05

ప్రజాశక్తి-సూళ్లూరుపేట : సూళ్లూరుపేట సిఐటియు అనుబంధ సంస్థ ఆషా వర్కర్స్ యూనియన్ మీటింగు ఆదివారం సూళ్ళూరుపేట సిఐటియు ఆఫీసు నందు జరిగింది. ఆషా వర్కర్స్ తిరుపతి జిల్లా యూనియన్ అధ్యక్షులు మీటింగుకు అధ్యక్షత వహించారు.జిల్లా కార్యదర్శి క్రిష్ణమ్మ ఏప్రిల్ ఛలో డిల్లీకి సభ్యులు ఆర్థికంగా స్వతహాగా సహకరించాలన్నారు.జిల్లా శ్రామిక మహిళా కన్వీనర్ లక్ష్మి అందరూ కలిసి కట్టుగా వుండి సమస్యలను సాధించాలన్నారు.సిఐటియు నాయకులు చంద్రశేఖర్ మాట్లాడుతూ పిడిఎఫ్ అభ్యర్థి మీగడ వెంకటేశ్వర రెడ్డి ఎమ్మెల్సీ అభ్యర్థిగా బలపరిచాలన్నారు.ఈ మీటింగుకు జిల్లా నాయకులు నాగరాజు,మండల నాయకులు  ఎస్.సాంబశివయ్య,సుంకర అల్లెయ్య తదితరులు హాజరయ్యారు.