Aug 02,2021 08:10

విజయవాడ : కృష్ణానదికి వరద ఉధృతి పెరుగుతోంది. ఎగువ నుండి ప్రకాశం బ్యారేజ్‌ కు సుమారు 5 లక్షల క్యూసెక్కుల వరకు వరద నీరు చేరుతోంది. సోమవారం ఉదయం 7 గంటలకు పులిచింతల ప్రాజెక్ట్‌ వద్ద 3,56,486 క్యూసెక్కులు అవుట్‌ ఫ్లో, ఇన్‌ ఫ్లో 3,56,486 క్యూసెక్కులుగా నమోదయింది. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్‌ వద్ద ఇన్‌ ఫ్లో 57,674 క్యూసెక్కులు, అవుట్‌ ఫ్లో 48,425 క్యూసెక్కులుగా నమోదయింది. ఈ నేపథ్యంలో... వరద ఉధృతిపై కృష్ణా జిల్లా కలెక్టర్‌ జె.నివాస్‌ అధికారులను అప్రమత్తం చేశారు. వరద ముంపు ప్రభావిత అధికారులకు తగిన సూచనలిచ్చారు. జగ్గయ్యపేట నుంచి ఇబ్రహీంపట్నం వరకు 18 మండలాల తహసీల్దార్లు అప్రమత్తంగా ఉండాలని, చినలంక, పెద లంక ప్రాంతాల్లో పటిష్టమైన చర్యలు తీసుకోవాలని చెప్పారు. కఅష్ణానది పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. వాగులు, వంకలు, కాలువలు దాటే ప్రయత్నం చేయకూడదని, వరద నీటిలో ఈతకు వెళ్ళడం, పశువులు-గొర్రెలను వదలడం లాంటివి చేయకూడదని జిల్లా కలెక్టర్‌ జె.నివాస్‌ హెచ్చరించారు.