
విజయవాడ : కృష్ణా నదికి వరద ఉధృతి తగ్గింది. శనివారం ప్రకాశం బ్యారేజ్ వద్ద ప్రస్తుత ఔట్ ఫ్లో 2,64,199 క్యూసెక్కులు కాగా, పులిచింతల దగ్గర ఔట్ ఫ్లో 84,780 క్యూసెక్కులుగా నమోదయింది. ప్రకాశం బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరికను అధికారులు ఉపసంహరించారు. వరద పూర్తిగా తగ్గేవరకు ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.